Queen Elizabeth :బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియ :లు ముగిసాయి. అంతిమయాత్రను అధికారిక లాంఛనాలతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. రాణి భౌతికకాయం ఉన్న వెస్ట్‌మినిస్టర్ అబెలో కుటుంబసభ్యులు తుది ప్రార్థనలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాల అధినేతలు కలిపి మొత్తం రెండు వేల మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. లండన్‌లోని 125 థియేటర్లరో రాణి అంత్యక్రియలను లైవ్ ప్రదర్శన చేశారు.
బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా ఉన్న 96 ఏళ్ల ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న స్కాట్లాండ్‌లోని బల్మోరల్ కోటలో కన్నుమూశారు. దీంతో రాజకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రపంచ దేశాలు రాణి మృతి పట్ల సంతాపం తెలిపాయి. రాణి వారసుడిగా ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3 బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.రాణి అంతిమయాత్ర కోసం బ్రిటన్ ప్రభుత్వం కనీవిని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేసింది.
1965లో చివరిసారిగా వినిస్టంట్ చర్చిల్‌కు అధికారికంగా ప్రభుత్వం ఈ స్థాయిలో అంత్యక్రియలు నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రముఖులు, లక్షల మంది బ్రిటన్ పౌరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.