London: సూర్యుడస్తమించని రాజ్యంలో గాడాంధకారం నెలకొనింది. గ్రేట్ బ్రిటన్ రాణి అయిన ఎలిజబెత్-2(96) ఇక మన మధ్య లేరు. అనారోగ్య సమస్యల దృష్ట్యా గురువారం రాత్రి ఆమె స్కాట్లాండ్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బ్రిటన్ రాణిగా 14 మంది ప్రధానులను ఆమె పరిపాలన సమయంలో చూసారు.
1926లో జన్మించిన ఎలిజబెత్-2, ప్రిన్స్ ఫిలిప్ మౌంట్ బాటెన్‌ను 1947లో వివాహం చేసుకున్నారు. 22 ఏళ్ల వయస్సులోనే గ్రేట్ బ్రిటన్ రాణిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలో అత్యధిక కాలం పరిపాలకురాలిగా ఆమె కొనసాగారు. రాణి 70 ఏళ్ల సేవలకు గుర్తుగా దేశవ్యాప్తంగా గత జూన్‌లో ప్లాటినం జూబ్లీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రిటన్ చరిత్రలోనే అత్యధిక కాలం పరిపాలించిన గొప్ప వ్యక్తిగా 2015లో ఎలిజబెత్-2 రికార్డుకెక్కారు. మరియు ప్రపంచంలోనే అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రెండో వ్యక్తిగా ఆమె నిలిచారు.
రాణి ఎలిజబెత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నడవడం, నిలబడడం కూడా రాణికి ఇబ్బందిగా మారడడంతో స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లోనే ఉంటూ గత కొద్ది రోజులుగా అధికారిక కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉన్నారు. బుధవారం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడం వల్ల ప్రత్యేక వైద్య బృందం ఆమెకు చికిత్స అందించారు. అయినా వారి ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. రాణి తుదిశ్వాస విడిచారు. తెలుసుకున్న బ్రిటన్ గాఢాంధకారంతో నిండిపోయింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా రాణి ఎలిజిబెత్-2 మరణానికి పలు దేశాధినేతలు సంతాపం ప్రకటించారు. ప్రపంచం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. బ్రిటన్ రాణి మరణంతో గుండె బరువెక్కిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.