PM Modi In G7 Summit:ఇటలీలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో సమావేశమయ్యారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్‌కీని కలిశారు. ఈ సందర్బంగా రష్యా-ఉక్రెయిన్ వివాదానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రధాని మోదీకి జెలెన్స్కీ వివరించినట్లు సమాచారం. గతేడాది మేలో హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. జెలెన్స్కీతో తన సమావేశం తర్వాత ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుస్థిరం చేసుకోవడానికి భారతదేశం ఆసక్తిగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.G7 సమ్మిట్‌గా పిలువబడే గ్రూప్ ఆఫ్ సెవెన్ గురువారం ఇటలీలోని బోర్గో ఎగ్నాజియాలోని విలాసవంతమైన రిసార్ట్‌లో ప్రారంభమయింది. ఇటలీ ప్రధాని మెలోని కి ఆహ్వానం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం ఉన్నతస్థాయి ప్రతినిధులతో కలిసి చేరుకున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మోదీకి ఇది మోదీకి తొలి విదేశీ పర్యటన.
స్తంభింపచేసిన రష్యన్ ఆస్తులను తాకట్టుగా ఉపయోగించి ఉక్రెయిన్‌కు $50 బిలియన్ల రుణానికి మద్దతు ఇవ్వాలనే అమెరికా ప్రతిపాదనపై కుదిరిన ఒప్పందంతో ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశం గురువారం ప్రారంభమైంది, ఈ ప్రతిపాదనలో భాగంగా రష్యాకు వ్యతిరేకంగా పోరాటంలో ఉక్రెయిన్‌కు సహాయం చేయడానికి $50 బిలియన్ల రుణం అందించబడుతుంది, ఇది రష్యా యొక్క స్తంభింపచేసిన సెంట్రల్ బ్యాంక్ ఆస్తుల నుండి వచ్చే లాభాలపై వచ్చే వడ్డీని ఉపయోగిస్తుంది, వాటిలో ఎక్కువ భాగం యూరోపియన్ యూనియన్‌లో తాకట్టుగా ఉన్నాయి. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
ఉక్రెయిన్‌కు 242 మిలియన్ పౌండ్ల సైనికేతర సహాయాన్ని అందిస్తామని తెలిపారు. అంతేకాదు రష్యా సైన్యానికి యుద్ధ సామాగ్రి సరఫరా చేస్తున్న దేశాలపై కొత్త ఆంక్షలును ప్రకటించారు.