Petrol Price: పాకిస్థాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రభావంగా.. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై హఠాత్తుగా 35 రూపాయలను పెంచేశారు.
దీంతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆహారం కూడా దొరకడం లేదు. ధాన్యాలు, నిత్యావసర సరుకులు దొరక్క అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. ఇక ఆదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
భారీగా పెరిగిన ధరలు..
ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ లో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే ధరలను రూ.35కు పెంచేసింది పాకిస్థాన్ ప్రభుత్వం. కిరోసిన్ ఆయిల్.. లైట్ డిజిల్ రేట్లను కూడా పెంచారు. పెరిగన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతుల భారం పెరిగినందుకే.. ఇలా ధరలు పెంచినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.
రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం..
పెట్రో ఉత్పత్తులు సరఫరా చేసే కంపెనీలకు బకాయిలు పేరుకపోయాయని.. వాటని చెల్లించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఇషాక్ దార్ వివరించారు.
రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలిసింది.
పాక్ లో సరిపడినంత నిల్వలు ఉన్నా.. కావాలనే ధరలు పెంచుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ఈ ధరల ఉత్పత్తులపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు.
దేశాన్ని పరిపాలించడం చేతకాకే.. ఆర్థిక సంక్షోభం వచ్చిందని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.
అప్పుల సంక్షోభం నుంచి బయటపడటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తోంది.
ఫైనాన్షియల్ బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. ఐఎంఎఫ్ ప్రతినిధులు సోమవారం పాకిస్తాన్ ను సందర్శించనున్నారు.
ఈ మేరకు వారి షెడ్యూల్ కూడా ఖరారైంది. పాకిస్తాన్ లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై అధ్యయనం చేసిన తరువాత- బెయిల్ అవుట్ ప్యాకేజీపై తుది నిర్ణయాన్ని తీసుకోనుంది.
గత ఏడాది అక్టోబర్ తర్వాత డీజిల్ ధరలు పెరగలేదని అన్నారు. ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయని అన్నారు.
వాటిని చెల్లించకపోవడం వల్లే ఇంధన సరఫరాను నియంత్రించాయని అన్నారు.
దేశంలో కిరోసిన్ లీటర్ ఒక్కింటికి రూ. 18 రూపాయలు మేర పెంచింది. ఫలితంగా దీని ధర రూ. 189.83 పైసలకు చేరింది.
లీటర్ లైట్ పెట్రోల్ ధర (Petrol Price) 187 రూపాయలుగా ఉంది.
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఐఎంఎఫ్ త్వరలో రానుంది.
ఈ నేపథ్యంలో హఠాత్తుగా పెట్రో ఉత్పత్తుల మీద ప్రభుత్వం ఇలా ధరలను పెంచేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/