Pakistan Attacks Iran: ఇరాన్‌లోని సిస్తాన్ అండ్ బలూచిస్థాన్ ప్రావిన్స్‌పై పాకిస్తాన్ ప్రతీకార దాడుల్లో ముగ్గురు మహిళలు మరియు నలుగురు పిల్లలతో సహా కనీసం ఏడుగురు మరణించారని ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అలీరెజా మర్హమతి స్టేట్ టీవీలో తెలిపారు. పాకిస్తాన్ దాడిలో మరణించిన వ్యక్తులు ఇరాన్ పౌరులు కాదని మర్హమతి చెప్పారు.
పాకిస్తాన్ భద్రతే ముఖ్యం..(Pakistan Attacks Iran)
ఇరాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం లక్ష్యంగా దాడులు చేసింది.పాకిస్తాన్ దాడిని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ సమయంలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాద రహస్య స్థావరాలపై అత్యంత సమన్వయంతో, ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్న ఖచ్చితమైన సైనిక దాడుల శ్రేణి అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పాకిస్థాన్ పూర్తిగా గౌరవిస్తుందని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ యొక్క భద్రత, జాతీయ ప్రయోజనాలను కొనసాగించడం చాలా ముఖ్యమైనదని ఇందులో రాజీపడమని పేర్కొంది.
మంగళవారం, ఇరాన్ పాకిస్తాన్ లోని మిలిటెంట్ స్థావరాలపై దాడిచేసినట్లు ధృవీకరించింది. ఇరాన్ యొక్క ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకారం, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అడ్ల్ టెర్రర్ గ్రూప్ యొక్క రెండు స్థావరాలను డ్రోన్లు మరియు క్షిపణులతో ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు పిల్లలు చనిపోయారని ఇరాన్ దీని పరిణామాలకు బాధ్యత వహించాలని పాకిస్తాన్ హెచ్చరించింది. దీనికి కొనసాగింపుగా బుధవారం పాకిస్తాన్ తన దేశం నుంచి ఇరాన్ రాయబారిని బహిష్కరించడమే కాకుండా ఇారాన్ నుంచి తన రాయబారిని వెనక్కి పలిపించింది.