Site icon Prime9

Pakistan: భారత్ నుంచి ఉల్లిపాయలు, టమాటా దిగుమతి చేసుకోనున్న పాకిస్తాన్

Pakistan: వరదల కారణంగా పంటలు దెబ్బతిని కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో టమాటా, ఉల్లిపాయలను భారత్‌ నుంచి దిగుమతి చేసుకోవాలని పాకిస్థాన్‌ సర్కారు భావిస్తోంది. లాహోర్‌ మార్కెట్లలో కిలో టమాటా 500 రూపాయలు, కిలో ఉల్లి 400రూపాయల చొప్పున పలికాయి. సింధ్‌, బలూచిస్థాన్‌ వంటి ప్రాంతాల నుంచి సరఫరాలు తగ్గడంతో కొరత మరింత తీవ్రమై, రానున్న రోజుల్లో పాక్‌లో వీటి ధర కిలో 700 రూపాయల వరకు దాటిపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

బంగాళాదుంపల ధర కిలో 40 నుంచి 120కి చేరుకుంది. ప్రస్తుతానికి ఉల్లి, టమాటా వంటివాటిని అఫ్గాన్‌ నుంచి తెచ్చుకుంటున్నారు. అది భారంగా మారడంతో త్వరలో వాఘా సరిహద్దు ద్వారా భారత్‌ నుంచి తెచ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలకు సుమారు 11వందల మంది మృతి చెందారు. సగం పాకిస్తాన్‌ నీట మునిగింది. ఆపన్న హస్తం కోసం విదేశీ సహాయం కోరుతోంది.

Exit mobile version