Mexico: మెక్సోకో దేశంలో వరుసగా మూడోసారి విద్యార్థులపై విషప్రయోగం జరిగింది. దక్షిణ మెక్సికో రాష్ట్రమైన చియాపాస్ లో గ్రామీణ మాధ్యమిక పాఠశాలలో చదువుతున్న 57 మంది విద్యార్థులపై గుర్తుతెలియని పదార్థంతో విషప్రయోగం చేశారు. విద్యార్థులంతా అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దానితో వారికి వివిధ పరీక్షలు నిర్వహించిన అనంతరం విద్యార్థులు కొకైన్ పాజిటివ్ గా తెలినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాగా కలుషితమైన ఆహారం, నీటి వల్లే తమ పిల్లల ఆరోగ్యం దెబ్బతినిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
గత రెండు వారాల్లో మూడు సార్లు విద్యార్థులపై విష ప్రయోగం జరిగినట్లు సమాచారం. బోచిన్ ప్రాంతానికి చెందిన 57 టీనేజ్ విద్యార్థులు విషపూరిత లక్షణాలతో స్థానిక ఆస్పత్రిలో చేరారని, ఒక విద్యార్థిని విషమంగా ఉండడం వల్ల పెద్దాసుపత్రికి తరలించామని, మిగిలిన విద్యార్థుల పరిస్థితి స్థిరంగా ఉందని మెక్సికన్ సోషల్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు, నాయకులు అధికారులపై మండిపడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పమంటే అధికారుల నుంచి సరైన సమాధానం ఉండడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: మరో హిందూ దేవాలయంపై దాడి