Site icon Prime9

UK: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో యూకే.. తిండి మానేస్తున్న ప్రజలు..!

crisis in uk

crisis in uk

UK: యునైటెడ్ కింగ్ డమ్ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. యూకేకు లిజ్ ట్రస్ ప్రధాని అయిన తర్వాత అక్కడ విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేయడంతో రానున్న కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచానా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ వాసులు ఖర్చులను తగ్గించుకునేందుకు భోజనాలను తగ్గించుకుంచుకోవడం గమనార్షం. ఎందుకంటే సెప్టెంబర్ నెలలో యూకేలో ద్రవ్యోల్భనం 10 శాతాని కన్నా ఎక్కువ అవడం వల్ల ఆహారధరలు విపరీతంగా పెరిగాయి.

యూకేలో సగం మంది ప్రజలు భోజనాల సంఖ్యను క్వాంటిటీని తగ్గించుకున్నారని కన్జూమర్ గ్రూప్ విజ్ పేర్కొంది. 3000 మందిపై ప్రజలను తీసుకుని సర్వే చేసిన తర్వాత ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ సంక్షోభం ఎదురైయ్యిందని దానితో ప్రజలు తినడం చాలా తక్కువ అయిందని తెలిసింది. 80 శాతం మంది ప్రజలు ఆర్థికంగా కష్టపడుతున్నారు. యూకే ప్రభుత్వం ఇంధన ధరలను ఫ్రీజ్ చేయడంతో అక్కడి ప్రజలు తమ ఇళ్లను కూడా వేడి చేసుకోలేకపోతున్నారని సర్వే వెల్లడించింది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఈ యూరోపియన్ దేశాల్లో తీవ్ర ఇంధన సమస్యలకు దారి తీస్తుందని చెప్పవచ్చు. యూకేతో పాటు చాలా యూరోపియన్ దేశాలు ఆర్థికంగా కుదేలు అవుతున్నాయి. రానున్నది శీతాకాలం కావడంతో యూరప్ వాసులు ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతారో వేచిచూడాలి. మరోవైపు లిజ్ ట్రస్ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చని బడ్జెట్, పన్నుల కోత వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం ముంగిట బ్రిటన్ వృద్ధి రేటు కూడా క్షీణిస్తుందని ఐఎంఎఫ్ ప్రిడిక్షన్స్ వెల్లడిస్తున్నాయి.

ఇదీ చదవండి:  అమెరికా విమానంలో అనుకోని అతిథి.. పామును చూసి బెంబేలెత్తిన ప్రయాణికులు

Exit mobile version