Site icon Prime9

Manisha koirala: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో భేటీ అయిన నటి మనీషా కొయిరాలా

Manisha koirala

Manisha koirala

Manisha koirala: బాలీవుడ్‌ నటి మనీషా కోయిరాలా బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌తో భేటీ అయ్యారు. బ్రిటన్‌ -నేపాల్‌ దేశాల మధ్య మైత్రీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్రిటన్‌లో సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటి మనీషా కోయిరాలా నేపాల్‌ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఈ కార్యక్రమం విశేషాలు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో చాలా మంది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హల్‌ చేస్తున్న సంజయ్‌ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన హీరా మండి… డైమాండ్‌ మార్కెట్‌ చూసిన వారే అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి మనీషా బ్లాక్‌ అండ్‌ గోల్డెన్‌ సారీ ధరించి చూపరులను ఆకర్షించారు. కాగా బ్రిటన్‌లో రిషి సునాక్‌తో తీసుకున్న పలు ఫోటోలను షేర్‌ చేశారు. అలాగే ఆమె ఒక్కరే 10 డౌనింగ్‌ స్ర్టీట్‌ ముందు నిబలడి ఓ ఫోటోను తీసుకున్న ఫోటోను కూడా షేర్‌ చేశారు.

నేపాల్ కు ఆహ్వానించాను..(Manisha koirala)

బ్రిటన్‌లో జరుగుతున్న యూకె – నేపాల్‌ మధ్య 100 సంవత్సరాల మైత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తనను ఆహ్వానించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అదీ కాకుండా ప్రధానమంత్రి రిషి సునాక్‌ నేపాల్‌ గురించి గొప్పగా మాట్లాడ్డం తమను మరింత ఆకట్టుకుందన్నారు. అదే సమయంలో తాను కాస్తంత చొరవ తీసుకొని ప్రధానమంత్రిని ఆయన కుటుంబాన్ని నేపాల్‌లోని తమ ఇంటికి రావాలని ఆహ్వానించానని చెప్పారు. అయితే కార్యక్రమానికి వచ్చిన అతిథుల్లో చాలా మంది హీరామండి చూశారని మనీష్‌ కోయిరాలా సంతోషంతో ఉబ్బితబ్బిబైపోతోంది.

ఇక హీరామండి సినిమా విషయానికి వస్తే.. చాలా గ్యాప్‌ తర్వాత ఆమె నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ప్లాట్‌ఫాంలో కనిపించారు. ఇండియాకు స్వాతంత్ర్యం రాక ముందు లాహోర్‌లో వేశ్యల బతుకుల గురించి సంజయ్‌ లీలా బన్సాలీ దర్శకత్వంలో హీరామండిని తెరకెక్కించారు. కాగా హీరామండికి ఫ్యాన్స్‌ నుంచి సెలెబ్రిటీల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, ఆదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్‌, షమీమ్‌ సైగల్‌ కీలకపాత్రలు పోషించారు.

Exit mobile version