London: బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా విదేశాంగ మంత్రి మరియు కన్జర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ సోమవారం ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ తన ప్రత్యర్థి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ పై 81,326 ఓట్లతో విజయం సాధించారు.
ఈ సందర్బంగా లిజ్ ట్రస్ మాట్లాడుతూ కన్సర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నుకోబడినందుకు తాను గౌరవంగా భావిస్తున్నానిని అన్నారు. మన గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి నాపై మీ నమ్మకాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు. ఈ కష్ట సమయాల్లో, మన ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడానికి నేను సాహసోపేతమైన చర్య తీసుకుంటాను. యునైటెడ్ కింగ్‌డమ్ సామర్థ్యాన్ని ఆవిష్కరిస్తానని తెలిపారు.
మాజీ ప్రధాని జోరిస్ జాన్సన్ ని ప్రస్తావిస్తూ, లిజ్ ట్రస్ ఇలా అన్నారు. బోరిస్, మీరు బ్రెగ్జిట్ పూర్తి చేసారు. మీరు వ్యాక్సిన్‌ను తయారు చేసారు. మీరు వ్లాదిమిర్ పుతిన్‌కు అండగా నిలిచారు అంటూ వ్యాఖ్యనించారు. మార్గరెట్ థాచర్ మరియు థెరిసా మే తర్వాత బ్రిటన్‌లో లిజ్ ట్రస్ మూడవ మహిళా ప్రధాన మంత్రి.