King Charles Coronation: బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో బ్రిటన్ కిరీటాన్ని ధరించారు.
కిరీటాన్ని ధరించిన రాజు (King Charles Coronation)
బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో బ్రిటన్ కిరీటాన్ని ధరించారు. దీంతో బ్రిటిష్ సామ్రాజ్యంలో 70 ఏళ్ల తర్వాత తొలి పట్టాభిషేకం జరిగింది. క్వీణ్ మరణంతో.. కింగ్ చార్లెస్ రాజయ్యారు. ఈ మేరకు సంప్రదాయాలను అనుసరించి కిరీటాన్ని ధరించారు. అనంతరం.. ఆయన సతీమణి కెమిల్లాకు రాణిగా కిరీటం అలంకరించారు.
ప్రదక్షిణ.. ప్రమాణాలు
ప్రమామ సమయంలో.. చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్ దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణానికి ముందు.. డైమండ్ కోట్ ధరించి బగ్గీలో బకింగ్ హమ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న అనంతరం.. నాలుగు దిక్కులా రాజు ప్రదక్షిణ చేస్తూ పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత చర్చి ఆఫ్ ఇంగ్లాండ్‌కు నమ్మకస్థుడైన క్రిస్టియన్‌గా ఉంటానని ఛార్లెస్ రెండో ప్రమాణం చేశారు.
బైబిల్ చదివిన రిషి సునాక్..
ప్రమాణం ముగియగానే సభలో ప్రార్థనలు చేశారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బైబిల్‌లోని కొన్ని పంక్తులను పఠించారు. ఈసారి పట్టాభిషేక వేడుకలో భిన్న మత విశ్వాసాలకు పెద్దపీట వేస్తున్నట్లు కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ కార్యాలయం అంతకుముందు తెలిపింది.
సింహాసనంపై ఆసీనులై..
ప్రమాణం, ప్రార్థనల తర్వాత 1300 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ చేయించిన సింహాసనాన్ని కింగ్ ఛార్లెస్-3 అధిష్ఠించారు.
ఈ సింహాసనం కింది అరలో స్కాట్లాండ్ నుంచి తెచ్చిన పవిత్ర రాయిని ఉంచారు.
అనంతరం కింగ్ ఛార్లెస్‌ను జెరూసలెం నుంచి తెచ్చిన పవిత్ర నూనెతో అభిషేకించారు. చేతులు, ఛాతీ, తలపై నూనెను పోశారు. ఇదంతా తెరచాటున జరిగింది.
నూనెతో అభిషేకం..
సంప్రదాయంగా వస్తున్న నూనెతో చార్లెష్ కు అభిషేకం చేశారు. అనంతరం బంగారుతాపడంతో తయారు చేసిన మహారాజ గౌన్ ధరించి సింహాసనాన్ని అధిష్టించారు.
కుడిచేతికి ఉంగరం తొడిగిన తర్వాత.. కరీటాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమం తర్వాత.. గాడ్ సేవ్ కింగ్ అంటూ నినాదాలు చేశారు.
సంప్రదాయ కార్యక్రమాలు పూర్తయ్యాక.. ప్రత్యేకంగా చేయించిన సింహాసనంపై ఆసీనులయ్యారు.
నవ్వుతూ కన్పించిన హ్యారీ..
రాచరికాన్ని వదులుకుని రాజకుటుంబానికి దూరమైన ఛార్లెస్-3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ కూడా పట్టాభిషేకానికి హాజరయ్యారు.
ఈ వేడుకలో తన కజిన్స్‌తో కలిసి నడిచిన హ్యారీ నవ్వుతూ కన్పించారు. అయితే ఈ కార్యక్రమానికి హ్యారీ ఒంటరిగానే వచ్చారు.
భార్య మేఘన్ మార్కెల్, ఆయన ఇద్దరు పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. హ్యారీ కుమారుడు ఆర్కీ ఈ రోజు నాలుగో పుట్టినరోజు జరుపుకొంటున్నాడు.