Kenya: కెన్యాలో మంగళవారం జరిగిన నిరసనల్లో కనీసం 13 మంది మరణించారని ఆ దేశ ప్రధాన వైద్యుల సంఘం అధికారి తెలిపారు.నైరోబీ మరియు దేశంలోని ఇతర నగరాల్లో పోలీసులు మరియు నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల మధ్య కెన్యా పార్లమెంటు మంగళవారం పన్నులను పెంచే వివాదాస్పద ఆర్థిక బిల్లును ఆమోదించింది.
పోలీసులు నిరసనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ మరియు వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. దీనితో నిరసనకారులు వారిపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో కెన్యా పౌరుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని తెలిపారు..ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కెన్యాలో పోలీసులు మరియు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అదేవిధంగా నిరసనకారులు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.
భారతీయులకు సూచన..(Kenya)
కెన్యాలోని తాజా పరిస్దితులపై భారత కాన్సులేట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరింది. అవసరం లేనిదే బయటకు వెళ్లరాదని సూచించింది. నిరసనలు, హింసాత్మకంగా ప్రభావితమైన ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపింది.