Israel-Hamas war: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజా స్ట్రిప్ నుండి హమాస్‌ను తుడిచిపెట్టేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ మిలటరీ గురువారం నాడు, గాజాలో 3,60,000 మంది బలగాలతో గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. అయితే, రాజకీయ నాయకత్వం ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదని ఉన్నత సైనిక అధికారి చెప్పారు.
బందీలను వదిలేంత వరకూ..(Israel-Hamas war)
ఇజ్రాయెల్ దళాలు మరియు హమాస్ మిలిటెంట్ల మధ్య కొనసాగుతున్న యుద్ధం రెండు వైపులా తీవ్రస్థాయి దాడులతో మరింత తీవ్రమవుతోంది. గాజా స్ట్రిప్‌పై బలగాలు బాంబు దాడులను కొనసాగిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్‌ను ప్రదర్శించడానికి అత్యవసర యుద్ధ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది.ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 1,200 మందిని పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు హతమార్చారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కనీసం 1,100 మంది మరణించారని మరియు 535 నివాస భవనాలు ధ్వంసమయ్యాయని, దాదాపు 250,000 మంది నిరాశ్రయులయ్యారని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.. గాజాను ఇజ్రాయెల్ ముట్టడించి సరఫరాలను అడ్డుకుంది. 2.3 మిలియన్ల జనాభాకు ఆహారం మరియు ఇంధన సరఫరా నిలిపివేయబడింది.బందీలుగా ఉన్న వారందరినీ విడిపించేంత వరకు గాజా స్ట్రిప్ ముట్టడికి విరమణ ఉండదని ఇజ్రాయెల్ గురువారం తెలిపింది. ఇజ్రాయెల్ బందీలకు స్వేచ్ఛ లేకుండా ముట్టడికి మినహాయింపు ఉండదని ఇజ్రాయెల్ ఇంధన మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అన్నారు.
ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులతో కూడిన మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరుతుందని వర్గాలు తెలిపాయి. ఈ విమానంలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న దాదాపు 230 మంది భారతీయులు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన చేరుకుంటారు. నెతన్యాహు, దేశాన్ని ఉద్దేశించి అర్థరాత్రి ప్రసంగిస్తూ, మిలిటెంట్ గ్రూప్ కనీసం 40 మంది శిశువులను శిరచ్ఛేదం చేసిందని పేర్కొన్న మీడియా నివేదికలను ధృవీకరించారు.వారు సైనికులపై క్రూరంగా దాడి చేశారని మరియు మహిళలపై అత్యాచారం చేశారని నొక్కి చెప్పారు. అబ్బాయిలు, అమ్మాయిలు తలపై కాల్చి చంపారని, ప్రజలను సజీవ దహనం చేశారని అన్నారు. ఇజ్రాయేలు పౌరులారా, ఇక్కడ ఉన్న నా సహోద్యోగులతో మరియు మీ అందరికీ నేను చెప్తున్నాను దైర్యంగా ఉండండి అని అన్నారు.