Site icon Prime9

Israel-Hamas War: జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బాంబు దాడులు.. 100 మంది మృతి

Israel_ Hamas War

Israel_ Hamas War

Israel-Hamas War:ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా సుమారుగా 100 మంది మరణించగా మరో 100 మంది శిధిలాల కింద కూరుకుపోయారని గాజాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం పేర్కొంది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 100 మందికి పైగా మరణించగా, శిథిలాల కింద 100 మంది చిక్కుకున్నారు. మరో 20 మంది గాయపడ్డారు.

ఆసుపత్రుల స్వాధీనం..(Israel-Hamas War)

జబాలియాలో తమ సైనికులు $1.4 మిలియన్ల విలువైన ఉగ్రవాద కార్యకలాపాలకు ఉద్దేశించిన ఆయుధాలను కనుగొన్నారని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది.సుదీర్ఘ ముట్టడి మరియు బాంబు దాడి తరువాత, ఇజ్రాయెల్ దళాలు ఆదివారం జబాలియాలోని అల్-అవ్దా ఆసుపత్రిని ఆక్రమించాయి, దాని వైద్య సిబ్బందిని చాలా గంటలు నిర్బంధించాయి. ఆసుపత్రి డైరెక్టర్‌ను అరెస్టు చేసి వైద్యులను అమానవీయ పరిస్థితుల్లో ప్రశ్నించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పాలస్తీనా ప్రాంతంలో, ఇజ్రాయెల్ దళాలు ముట్టడి, దాడి చేసి, అనేక ఆసుపత్రులను తమ ఆధీనంలోకి  తీసుకున్నాయి.గాజా సిటీ అల్-షిఫా హాస్పిటల్‌లో హమాస్ సొరంగం నెట్‌వర్క్ తమ క్రింద నడుస్తోందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

 

Exit mobile version
Skip to toolbar