Site icon Prime9

Israel- india: ఇజ్రాయెల్ పై మాల్దీవుల నిషేధం.. భారతీయ ద్వీపాలవైపు ఇజ్రాయెల్ చూపు

Israel- india

Israel- india

Israel- india:గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రకటించిన వెంటనే ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డాయి. తాజాగా వారి సరసన మాల్దీవ్స్‌కూడా జత చేరింది. ఇజ్రాయెల్‌ పౌరులను తమ దేశంలోకి అనుమతించమని తేల్చేసింది. దీనికి ఇజ్రాయెల్‌ ప్రభుత్వం కూడా గట్టిగానే స్పందించింది. తమ పౌరులను మాల్దీవ్స్‌ బదులు ఇండియాలోని లక్ష్యదీప్‌కు వెళ్లాలని సూచించింది.

  మాల్దీవ్స్‌కు బదులు లక్షద్వీప్‌కు వెళ్లండి..(Israel- india)

కాగా మల్దీవ్స్‌ నిర్ణయాన్ని కౌన్సిల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌.. మిడ్‌వెస్ట్‌ …ఇండియాకు చెందిన కొబ్బి శోషని చెప్పారు. వివాదాస్పదనమైన నిర్ణయం తీసుకున్నందుకు మల్దీవ్స్‌ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెలీలు ఇక నుంచి అందమైన లక్ష్యద్వీప్‌కు వెళ్లవచ్చునని ట్విట్టర్‌లో ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. పనిలో పనిగా కొబ్బి శోషని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యద్వీప్‌ వెళ్లి ప్రకృతిని ఆనందించండని భారతీయులను ఉద్దేశించి చేసిన ట్విట్‌ను ఆయన జత చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో మాల్దీవ్స్‌కు ఇండియాకు మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తింది. ప్రధానమంత్రి మోదీ మాల్దీవ్‌కు వెళ్లి అక్కడ ప్రకృతిని ఆస్వాదించిన తర్వాత దేశ ప్రజలను మాల్దీవ్స్‌కు వెళ్లే బదులు మన దేశంలోని లక్ష్యద్వీప్‌కు వెళ్లండని, దేశీయ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలిన ప్రజలను కోరారు. ఇది మాల్దీద్‌ ప్రెసిడెంట్‌తో పాటు కొంతమంది మంత్రులకు మింగుడుపడలేదు. దీంతో ఇరు దేశాల మధ్య ‘బాయ్‌కాట్‌ మాల్దీవ్‌” పేరుతో సోషల్‌ మీడియాలో యుద్ధం జరిగింది.

ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం అందమైన ఇండియన్‌ బీచ్‌ల ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇక మాల్దీవ్‌లు ఎలానూ ఇజ్రాయెలీలను తమ దేశంలో అడుగుపెట్టనీయరు కనుక… ఇజ్రాయెలీలు ఇక నుంచి ఇండియాకు వెళ్లండి.. అక్కడ బీచ్‌లను సందర్శించండి.. ఇజ్రాయెలీలకు ఇండియా మంచి ఆతిధ్యం ఇస్తుందని రాయబారకార్యాలయం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. మాల్దీవ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మహ్మద్‌ మెయిజ్జు తన కేబినెట్‌తో చర్చలు జరిపిన తర్వాత తమ దేశంలోకి ఇజ్రాయెల్‌ పాస్ట్‌పోర్టు కలిగిన వారిని ఎట్టిపరిస్థితిలో అడుగుపెట్టనీయరాదని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి ఇ్రజాయెలీ పర్యాటకులు ఇండియాలోని లక్ష్యద్వీప్‌కు రానున్నారు.

Exit mobile version