Imran Khan: తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్ శిక్షను నిలిపివేసిన ఇస్లామాబాద్ హైకోర్టు..అయితే ఇమ్రాన్ జైలులోనే ఉండాలని ఆదేశం.

పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు తోషా ఖానా కేసులో భారీ ఊరట లభించింది. ట్రయల్‌ కోర్టు తోషా ఖానా కేసులో ఖాన్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ నెల 5వ తేదీన ఖాన్‌ అరెస్టు అయ్యి అటాక్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 07:41 PM IST

Imran Khan: పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు తోషా ఖానా కేసులో భారీ ఊరట లభించింది. ట్రయల్‌ కోర్టు తోషా ఖానా కేసులో ఖాన్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ నెల 5వ తేదీన ఖాన్‌ అరెస్టు అయ్యి అటాక్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా ఖాన్‌కు చెందిన లాయర్లు ఈ తీర్పును ఇస్లామబాద్‌ హైకోర్టు సవాలు చేశారు. కాగా సోమవారం ఈ కేసును సంబంధించి తీర్పును రిజర్వులో ఉంచారు. మంగళవారం నాడు తోషాఖానా కేసుకు సంబంధించి శిక్షను ఉన్నత న్యాయస్థానం నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని ఖాన్‌ తరపు న్యాయవాదులు డిమాండ్‌ చేశారు.

బుధవారం హాజరుకావాలి..(Imran Khan)

అయితే అధికార రహస్యాల చట్టం కేసు కింద ప్రత్యేక కోర్టు ఖాన్‌ కేసును విచారిస్తోంది. కాగా అటాక్‌ జైలు సూపరింటెండ్‌కు స్పెషల్‌ కోర్టు లేఖ రాస్తూ… ఇమ్రాన్‌ను వెంటనే విడుదల చేయవద్దని ఆయనను అధికార రహస్యాల చట్టం కేసుకు సంబంధించి బుధవారం నాడు తమ ముందు హాజరుపర్చాలని ఆదేశించింది. ఇక అధికార రహస్యాల కేసు విషయానికి వస్తే ఇమ్రాన్‌ఖాన్‌ చేతిలో ఉండాల్సినడిప్లొమాటిక్‌ డాక్యుమెంట్‌ మాయమైంది. ఈ పత్రం విషయానికి వస్తే అమెరికా ఇమ్రాన్‌ను అధికారంలోంచి తొలగించాలనేది ఈ డాక్యుమెంట్‌ సారాంశంగా చెబుతున్నారు. ఇదే కేసుకు సంబంధించి పీటీఐ వైస్‌ చైర్మన్‌ మాజీవిదేశాంగమంత్రి షా మహ్మద్‌ ఖురేషిపై కూడా కేసు కొనసాగుతోంది.

గత వారం పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు కూడా తోషా ఖానా కేసు తీర్పులో పొరపాట్లు జరిగాయని అంగీకరించింది. ఇస్లామాబాద్‌ హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకొనే అవకాశం ఉందని పిటిఐ లీగల్‌ టీం అభిప్రాయపడింది. కాగా సోమవారం నాడు ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ తరపు అడ్వకేట్‌ అమ్జాద్‌ పర్వేజ్‌ తన వాదనలను ముగించారు. ఇమ్రాన్‌ తరపున లతీష్‌ కోసా వాదనలు వినిపించారు. కాగా కోర్టు తీర్పును సోమవారం రిజర్వులో పెట్టింది. మంగళవారం నాడు తీర్పు వెలువరిస్తామని వెల్లడించింది. కాగా ఇస్లామాబాద్‌ హైకోర్టుకు మంగళవారం నాడు ఇమ్రాన్‌ సోదరిమణులు అలీమాఖాన్‌, ఉజ్మాఖాన్‌లు కూడా విచారణకు హాజరయ్యారు. ఇస్లామాబాద్‌ హైకోర్టు తీర్పు తర్వాత పిటిఐ వెంటనే ఖాన్‌ జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. పీటీఐ తరపు న్యాయవాది అలీ జఫర్‌ మాట్లాడుతూ.. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. తోషాఖాన్‌ కేసులో ఖాన్‌పై చేసిన ఆరోపణల్లో సాక్ష్యాలు లేవని తెలిపింది. అయితే ట్రయల్‌ కోర్టు జడ్జి ఇమ్రాన్‌ తన తరపున సాక్ష్యాలు చూపిస్తామన్న ఆయన అనుమతించలేదని అన్నారు. దోషి తన వాదన వినిపించే అవకాశం ట్రయల్‌ కోర్టు ఇవ్వలేదని ఖాన్‌న్యాయవాది వివరించారు. ప్రస్తుతం ఖాన్‌ శిక్షను ఇస్లామబాద్‌ కోర్టు నిలిపివేసిందన్నారు.

ఇదిలా ఉండగా ఇమ్రాన్‌ ఖాన్‌ తీర్పుపై పీఎంఎల్‌ -ఎన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ ప్రెసిడెంట్‌ షెహబాజ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ.. ఖాన్‌ శిక్షను కోర్టు రద్దు చేయలేదని.. తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థను చూస్తే ఆందోళన కలుగుతోందన్నారు. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు ఆదేశాలు వస్తే.. పాపం హైకోర్టు న్యాయమూర్తులు ఏమీ చేయగలరు అని షెహబాజ్‌ వ్యాఖ్యానించారు. ఇమ్రాన్‌కు ఐహెచ్‌సీ మూడేళ్ల శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే అధికార రహస్యాల చట్టం కింద రేపు ఉదయం 11 గంటలకు ఖాన్‌ ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. మరి ఆ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో రేపటి వరకు ఆగాల్సిందే.