Prime9

Iran Weight LIfter : ఆ దేశ క్రీడాకారుడికి షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు ఇరాన్ వెయిట్ లిఫ్టర్ పై జీవిత కాల నిషేదం..

Iran Weight LIfter : ప్రస్తుత ప్రపంచంలో పలు దేశాల మధ్య మైత్రి బంధం అయితే లేదని చెప్పాలి. ఇరాన్ – ఇజ్రాయెల్, ఉత్తర కొరియా – దక్షిణ కొరియా ఇలా పలు దేశాలలో పరిస్థితులను గమనించవచ్చు. అయితే అదే ఇప్పుడు ఇరాన్ దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ కొంప ముంచింది. అతను చేసిన పని వల్ల ఇప్పుడు జీవితకాలం నిషేదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతకీ అతను చేసిన పొరపాటు ఏంటి, అస్తవరి ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

పోలండ్‌లోని వీలిక్జాలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ చాంపియన్‌షిప్‌లో శనివారం ఇరాన్‌కు చెందిన మోస్తాఫా రాజేయి (40).. సహచర ఇజ్రాయెల్ వెయిట్‌లిఫ్టర్ అయిన మాక్సిమ్ స్విర్‌స్కీతో చేతులు కలిపాడు. కాగా శత్రుదేశ ఆటగాడితో చేతులు కలిపాడన్న కారణంతో తమ దేశ ఆటగాడిపై ఇరాన్ ప్రభుత్వం అతడిపై జీవితకాల నిషేధం విధించింది. అలానే మోస్తఫా రాజేయిని దేశంలోని ఏ క్రీడలోనూ ఆడకుండా జీవితకాల నిషేధం విధించినట్టు వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ పేర్కొంది.

Iranian weightlifter

అదే విధంగా ఈ పోటీకి సంబంధించిన ప్రతినిధి బృందం హెడ్ హమీద్ సలేహినియాను కూడా తొలగించింది. ఇజ్రాయెల్‌ను బద్ధ శత్రువుగా పరిగణించే ఇరాన్ ఆ దేశంతో అన్ని సంబంధాలను తెంచుకుంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version
Skip to toolbar