Ukraine: ఏ దేశ సైనిక శక్తికైన ఆర్ధిక వనరులు ఎంతో ప్రధానం. మరీ ముఖ్యంగా యుద్ధంలో పాల్గొనే దేశాలు మరింతగా ఆర్ధిక కేటాయింపులు చేయాలి. లేదంటే యుద్దానికి దిగకూడదు. ప్రారంభమైన యుద్ధం ఎప్పుడు ముగుస్తోందో తెలియకపోతే సొంత సైనికులే నిలదీసే పరిస్ధితులు వస్తాయని ఉక్రెయిన్-రష్యా వార్ తో తెలివచ్చేలా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది. ఇంగ్లిష్ సబ్-టైటిల్స్ ఉన్న ఈ వీడియోను దిమిత్రి అనే నెటిజన్ ట్విటర్ లో షేర్ చేశాడు.
ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ ప్రకటన ప్రకారం ఉక్రెయిన్‌తో యుద్దం కోసం సైన్యంలోకి తీసుకున్న వాలంటీర్లకు జాతీయ సగటు కంటే రెండు రెట్ల ఎక్కువ వేతనం చెల్లిస్తామని రష్యన్ అధికారులు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రష్యా సైన్యంలో చేరిన వాలంటీర్లకు వేతనాల చెల్లించకపోవడంతో ఉన్నతాధికారులను వారు నిలదీస్తున్నారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం కుటుంబాలకు ఇంకా వేతనాలు అందలేదని, వాటిని ఇచ్చేవరకు ఉక్రెయిన్‌లో పోరాడబోమని ఈ వీడియోలో సైనికులు తెగేసి చెబుతున్నారు. రష్యన్ సైన్యంలో చేరేందుకు తమ కుటుంబాలకు చెల్లిస్తామన్న 300,000 రూబిళ్లు ఇంకా ఇవ్వలేదని సైనికులు ఆ వీడియోలో ఆరోపిస్తున్నారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్ పార్లమెంట్ గురువారం 2023 ముసాయిదా బడ్జెట్‌ను 38 బిలియన్ల డాలర్ల రికార్డు లోటుతో ఆమోదించింది. రష్యా పై విజయాన్ని చేరువ చేయడంలో సహాయపడటానికి ఉద్దేశించిన ఒక వ్యయ ప్రణాళిక అని ప్రధాన మంత్రి అన్నారు. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమైన రష్యా దండయాత్ర తరువాత సాయుధ దళాలు, జాతీయ భద్రత కోసం 1 ట్రిలియన్ హ్రైవ్నియా (27.08 బిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ కేటాయించామని, ఇది విజయం కోసం బడ్జెట్ అని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. మరోవైపు, రష్యా తీవ్ర సంక్షోభం దిశగా సాగుతోంది.
Russian mobiks are demanding the “promised” one-off payment of 300,00 roubles, which the military rep says was never actually promised to them 😂 They yell that the deputies should go fight themselves in this case. pic.twitter.com/df96pfvUfM
— Dmitri (@wartranslated) November 2, 2022
ఇది కూడా చదవండి: Imran Khan: అందుకే మాజీ ప్రధానిని చంపాలనుకున్నా.. నిందితుడి వీడియో వైరల్