IDF Strikes: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ఖాన్ యూనిస్‌లో హమాస్‌పై దాడులను కొనసాగిస్తోంది. ఇక్కడ ఉగ్రవాదులు నాజర్, అల్-అమల్ ఆసుపత్రుల లోపల మరియు చుట్టుపక్కల నుండి పనిచేస్తున్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారిక ప్రతినిధి ఇలోన్ లెవీ చెప్పారు.
ఖాన్ యూనిస్‌లో వేర్వేరు వైమానిక దాడుల్లో 10 మందికి పైగా సాయుధ హమాస్ ముష్కరులతో సహా అనేక మంది ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని, అంతమొందించినట్లు ఐడిఎఫ్ తెలిపింది. డజన్ల కొద్దీ హమాస్ కార్యకర్తలు మరణించినట్లు పేర్కొంది,ఆ ప్రాంతంలోని తీవ్రవాద మౌలిక సదుపాయాలను కూడా ఐడిఎఫ్ దళాలు ధ్వంసం చేశాయి. మాగ్లాన్ కమాండో యూనిట్ ఖాన్ యూనిస్‌లో దాడులు నిర్వహించింది. ఉత్తర గాజాలో మిగిలిన హమాస్ మౌలిక సదుపాయాలను ఐడిఎఫ్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి.ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజాలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 26,000 దాటిందని హమాస్ ఆధ్వర్యంలోని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. అక్టోబరు 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 64,487 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారని, మొత్తం మృతుల సంఖ్య 26,083 అని మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన వారిలో మూడింట రెండు వంతుల మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.గడిచిన 24 గంటల్లో 183 మంది మృతి చెందగా, 377 మంది గాయపడ్డారని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అష్రఫ్ అల్-ఖిద్రా ఒక ప్రకటనలో తెలిపారు.