Helicopter Crash In Ukraine: ఉక్రెయిన్ కీవ్ ప్రాంతంలోని కిండర్ గార్టెన్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయి, ఇద్దరు పిల్లలు మరియు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రితో సహా 16 మంది మరణించారు.
ఈ ప్రమాదంలో అంతర్గత వ్యవహారాల మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ, అతని మొదటి డిప్యూటీ యెవెన్ యెనిన్ మరియు మంత్రిత్వ శాఖ రాష్ట్ర కార్యదర్శి యూరి లుబ్కోవిచ్ మరణించారు.
హెలికాప్టర్ అకస్మాత్తుగా కూలిపోవడానికి కారణం ఏమిటనేది నిర్ధారించాల్సి ఉంది.
కిండర్ గార్టెన్ మరియు నివాస భవనం సమీపంలో హెలికాప్టర్ కూలిపోయి(Helicopter Crash In Ukraine) పలువురు గాయపడినట్లు కైవ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అధిపతి తెలిపారు.
ప్రమాద సమయంలో, కిండర్ గార్టెన్‌లో పిల్లలు మరియు సిబ్బంది ఉన్నారు.
టెలిగ్రామ్‌లో షేర్ చేయబడిన దృశ్యాలు నివాస భవనం మంటల్లో ఉన్నట్లు చూపించాయి
ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న ఫుటేజీలో పిల్లలను రక్షించడానికి అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్దలంలో పని చేయడం కనిపించింది.
జనవరి 14 న డ్నిప్రో నగరంలోని తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనంపై రష్యా క్షిపణుల దాడిలో ఐదుగురు మరణించగా పలువురు గాయపడ్డారు.
రష్యా క్షిపణి దాడుల వల్ల కైవ్‌లోని అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ వైమానిక దాడులు అనేక ప్రాంతాలలో ఎమర్జెన్సీ బ్లాక్‌అవుట్‌లకు కారణమయ్యాయి.
ఉక్రెయిన్ యొక్క మౌలిక సదుపాయాలను లక్ష్యంగా రష్యా ప్రయోగించిన పదవ క్షిపణి ఇది.
ఉక్రెయిన్‌కు యూఎస్ సాయం..
రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు యూఎస్ మిలిటరీ ఇజ్రాయెల్‌లో నిల్వ చేసిన పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని అందజేస్తోంది.
ఈ ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి సాధారణంగా మధ్యప్రాచ్యంలోని సంఘర్షణల కోసం ఉద్దేశించబడ్డాయి.
అయితే అత్యవసర సమయాల్లో సరఫరాలను యాక్సెస్ చేయడానికి ఇజ్రాయెల్‌కు యూఎస్ అనుమతిని ఇచ్చింది.
యునైటెడ్ స్టేట్స్‌లో షెల్‌ల నిల్వలు పరిమితంగా ఉండటంతో రెండు వనరులను ఆశ్రయించింది.
ఒకటి దక్షిణ కొరియాలో మరియు ఒకటి ఇజ్రాయెల్‌లో ఉన్నాయి.
ఇది అమెరికా పారిశ్రామిక స్థావరం యొక్క పరిమితులను తెలియజేస్తోంది.
దక్షిణ కొరియా మరియు ఇజ్రాయెల్ రెండూ ఉక్రెయిన్‌కున సహాయాన్ని పంపకూడదని నిర్ణయించాయి.
రష్యాతో సంబంధాలను దెబ్బతింటాయనే కారణంగా ఇజ్రాయెల్ ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించడానికి నిరాకరించింది.
యుఎస్ మిలిటరీ ఇజ్రాయెల్‌లోని మందుగుండు సామగ్రిని సేకరించింది.
రష్యాపై తిరుగుబాటుకు జర్మనీలో సమావేశం..
ఉక్రెయిన్ కోసం ఉద్దేశించిన 300,000 రౌండ్లలో దాదాపు సగం ఇప్పటికే ఐరోపాకు రవాణా చేయబడ్డాయి.
ఉక్రెయిన్‌కు మరిన్ని ట్యాంకులు మరియు ఇతర ఆయుధాలు అందించడంపై చర్చించడానికి నాటోతో సహా వివిధ దేశాలకు చెందిన రక్షణ మరియు సైనిక నాయకులు జర్మనీలో సమావేశం కాబోతున్నారు.
రష్యా రాంబో పిలువబడే స్మోలియానినోవ్ ఉక్రెయిన్ కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
రష్యన్ ప్రచురణ సంస్ద అయిన నోవాయా గెజిటాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను తన మాతృభూమి పట్ల ద్వేషం తప్ప మరేమీ లేదని చెప్పాడు.
యుద్ధభూమిలో తన దేశ ప్రజలను చంపడానికి ఎటువంటి సంకోచం లేదని చెప్పాడు. రష్యా వైపు ఉన్న వ్యక్తుల పట్ల నాకు ద్వేషం తప్ప మరేమీ లేదని వ్యాఖ్యానించాడు.
ఇంటర్వ్యూ తర్వాత కొన్ని రోజుల తర్వాత, స్మోలియానినోవ్‌ను రష్యన్ ప్రభుత్వం విదేశీ ఏజెంట్‌గా వర్ణించింది.
రష్యాపై గతంలో చేసిన వ్యాఖ్యలపై అతను క్రిమినల్ విచారణను కూడా ఎదుర్కొంటున్నాడు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/