Site icon Prime9

Hamas: హమాస్ శరణార్థుల ఇంధనం, వైద్యసామగ్రి దొంగిలించింది..ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్)

Hamas

Hamas

Hamas: గాజా స్ట్రిప్ ప్రాంగణంలో ఐక్యరాజ్యసమితి కార్యాలయాల నుండి శరణార్థుల కోసం ఉద్దేశించిన ఇంధనం మరియు వైద్య సామాగ్రిని హమాస్ దొంగిలించిందని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ ఇన్ ది నియర్ ఈస్ట్ (UNRWA) తెలిపింది.

హమాస్ నిజస్వరూపం బయటపడింది..

గాజా నగరంలోని యునైటెడ్ నేషన్స్ కార్యాలయాల నుండి హమాస్ ఇంధనం మరియు వైద్య పరికరాలను దొంగిలించిందని తెలిసింది. దీనితో హమాస్ యొక్క నిజస్వరూపం బయటపడింది. దొంగిలించబడిన ఇంధనం మొత్తం గాజా నీటిని 6 రోజుల పాటు డీశాలినేషన్ చేయడానికి సరిపోతుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి (ఐడిఎఫ్) రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి చెప్పారు. ఇజ్రాయెల్ మిలిటరీ హమాస్ ద్వారా కిడ్నాప్ చేయబడిన వారి సంఖ్యను 199 కి సవరించింది. కిడ్నాప్ అయిన వారిలో విదేశీయులు ఉన్నారా లేదా అన్నది పేర్కొనబడలేదని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రతీకార చర్యకు దిగడంతో  పది లక్షల మందికి పైగా  ప్రజలు గాజా స్ట్రిప్‌లోని తమ ఇళ్లను వదిలి పారిపోయారు. ఇజ్రాయెల్ భూదాడికి సిద్దమవుతుండటంతో పరిస్దితి మరింత క్షీణించే అవకాశముందని సహాయ బృందాలు హెచ్చరిస్తున్నాయి.

Exit mobile version