Site icon Prime9

Africa: నైజీరియాలో దారుణం.. 47 మందిని కాల్చి చంపిన సాయుధులు

africa

africa

Africa: ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు నరమేధం సృష్టించారు. ఈ నరమేధంలో 50 మందిని ఊచకోత కోశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.

47 మంది ఊచకోత.. (Africa)

ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు నరమేధం సృష్టించారు. ఈ నరమేధంలో 50 మందిని ఊచకోత కోశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. బెన్యూ రాష్ట్రంలోని ఉమోగిడి గ్రామంలో మారణాహోమం జరిగింది. ఈ మారణకాండలో సాయుధులు 50 మందిని ఊచకోత కోశారు.

బుధవారం నాడు విచక్షణ రహితంగా కాల్పులు జరిగాయి. ఇందులో 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు.. ఒటుక్పో స్థానిక ప్రభుత్వ చైర్మన్ తెలిపారు.

దీనికి ఒకరోజు ముందే.. ఇదే ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ దాడిని బెన్యూ స్టేట్ పోలీసులు ధృవీకరించారు.

దుండగులు అకస్మాత్తుగా మార్కెట్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని, ఈ దాడిలో ఒక పోలీసు అధికారి కూడా మరణించినట్లు సీవీస్ తెలిపారు.

ఈ దాడులపై ఇప్పటివరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. ఈ ఘటన వెనక ఎవరున్నారో తెలియాల్సి ఉంది. ఈ రెండు ఘటనలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా ఉత్తర-మధ్య నైజీరియాలో భూ వివాదాలపై గతంలో రైతులతో ఘర్షణ పడిన స్థానిక పశువుల కాపరులపై అనుమానం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గతంలోను నైజీరియాలో ఇలాంటి దాడులు జరిగాయి. పశువుల కాపరులు తమ పొలాల్లో తమ పశువులను మేపుతున్నారని, ఈ కారణంగా తమ పంట నాశనమవుతోందని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1965లో తొలిసారిగా చట్టం ద్వారా ఆ భూములు మేత దారులేనని పశువుల కాపరులు నొక్కి చెప్పారు.

దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బెన్యూ రాష్ట్రాన్ని “నైజీరియా ఆహార బుట్ట”గా అక్కడి ప్రజలు పిలుస్తారు. ఆ ప్రాంతంలో పంటలు సమృద్దిగా పండుతాయి.

అయితే తరచుగా జరిగే ఈ ఘర్షణల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతం నుంచి వ్యవసాయ దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి.

దీంతో ఆకలితో అలమటించే పేద ప్రజలను ఈ పరిస్థితి మరింత కుంగతీస్తుంది.

Exit mobile version