Site icon Prime9

Britain Elections: బ్రిటన్‌లో జూలై 4న సార్వత్రిక ఎన్నికలు

Britain Elections

Britain Elections

 Britain Elections:బ్రిటన్‌లో జూలై 4న జనరల్‌ ఎలక్షన్స్‌ జరుగనున్నాయి. ప్రధానమంత్రి రిషి సునాక్‌ బుధవారం నాడు ఎన్నికల తేదీని ప్రకటించారు. అయితే ఈ సారి ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా YouGov/Times నిర్వహించిన పోల్స్‌లో అధికార కన్సర్వేటివ్‌ పార్టీ 20 శాతం, లేబర్‌ పార్టీకి 47 శాతం ఓట్లు దక్కించుకునే అవకాశాలున్నయాని తేల్చి చెప్పింది. ఒక ఎకనమిస్ట్‌ మాత్రం కన్సర్వేటివ్‌ల కంటే లేబర్‌ పార్టీ 23 పాయింట్లతో ముందంజలో ఉంటుందని అంచనా వేసింది.

20 పాయింట్ల ముందంజలో లేబర్ పార్టీ.. ( Britain Elections)

బ్రిటన్‌లో అధికార పార్టీ క్రమంగా తన పట్టుకోల్పోతోంది. లిజ్‌ ట్రస్‌ స్వల్పకాలికానికి ప్రధానమంత్రిగా 2022లో కొనసాగారు. అప్పుడు అధికారపార్టీ కంటే ప్రతిపక్ష లేబర్‌ పార్టీ 20 పాయింట్లు ముందంజలో ఉంది. ఇక రిషి సునాక్‌కు చెందిన అధికార కన్సర్వేటివ్‌ పార్టీ 2010 నుంచి అధికారంలో కొనసాగుతోంది. అయితే 2021 నుంచి స్థానికంగా జరిగిన ఎన్నికల్లో లేబర్‌పార్టీ క్రమంగా పుంజుకుంటోంది. పోలింగ్‌ ఎక్స్‌ఫర్ట్‌ జాన్‌ కర్టైస్‌ అంచనా ప్రకారం జూలై 4వ తేదీ వరకు పరిస్థితి ఇలా ఉంటే కన్సర్వేటివ్‌ పార్టీ కేవలం కొన్ని సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని చెబుతున్నారు. 1997 నాటి సీన్‌ రిపీట్‌ అవుతుందని.. అప్పుడు టోనీ బ్లెయర్‌ నాయకత్వంలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం 650 సీట్లకు గాను కేవలం 165 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.

ఏప్రిల్‌లో నిర్వహించిన ఒపినీయన్‌ పోల్స్‌లో టోరీలు అంటే అధికార పార్టీ కేవలం 85 సీట్లు సాధించే అవకాశాలున్నాయని.. లేబర్‌పార్టీ 472 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. సుమారు 294 సీట్లు మెజారిటి దక్కించుకుంటుందని అంచనా వేసింది. కన్సర్వేటివ్‌పార్టీనే కాకుండా సునాక్‌ ప్రజాదరణ కూడా బాగా బలహీనపడింది. ప్రధానమంత్రికి కేవలం 20 శాతం మంది అనుకూలంగా ఉంటే.. 71 శాతం మాత్రం వ్యతిరేకంగా ఉన్నారని యూ గౌవ్‌ ఇటీవల నిర్వహించినపోలింగ్‌ తేలింది. యూ గౌవ్‌ నిర్వహించిన సర్వేలో సగం కంటే ఎక్కువ మంది సునాక్‌ను అసమర్థుడని, నమ్మకస్తుడు కాదని, బలహీనుడు అంటూ చాలా మంది వ్యతిరేకతను చాటుకున్నారు. ఇక లేబర్‌ లీడర్‌ కెయిర్‌ స్టామర్‌ ప్రజాదరణ అమాంతం పెరిగిపోయింది. అయినా ఓటర్లలో ఆయన పట్ల కూడా వ్యతిరేక ఉంది. ఆయన నెట్‌ స్కోర్‌ -17గా ఉంది. కాగా ఈ సారి ఎన్నికల్లో ప్రధానంగా మూడు అంశాలు ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, ఇమ్మిగ్రేషన్ కీలకపాత్ర పోషించనున్నాయి.

Exit mobile version
Skip to toolbar