Site icon Prime9

United Arab Emirates: గల్ఫ్ జాబ్ ఇక చాలా ఈజీ..

UAE

UAE

United Arab Emirates: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ సోమవారం నుంచి అప్‌డెటేడ్‌ వీసా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. పర్యాటకుల కోసం పలు ఆప్షన్లు అందుబాటులో ఉంచింది. అయితే ఇక్కడ దీర్ఘకాలం పాటు ఉండాలనుకొనే వారికి గతంలో ఎవరో ఒకరు స్పాన్సర్‌ చేయాల్సి ఉండేది. ప్రస్తుతం ఆ నిబంధన ఎత్తివేసింది. స్పాన్సర్‌ అవసరం లేకుండానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా నిబంధనల్లో మార్పుల గురించి ఫెడరల్‌ అధారిటీ ఫర్‌ ఐడెంటిటీ సిటిజన్‌షిప్‌ కస్టమ్స్‌ అండ్‌ పోర్ట్స్‌ సెక్యూరిటీ గత నెల 5వ తేదీన అధికారికంగా ఓ ప్రకటన చేసింది. విదేశాల నుంచి యూఏఈకి వచ్చే వారి కోసం కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నామని, దీంతో వారికి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయని.. అలాగే ఇక్కడ నివాసం ఉన్న వారికి కూడా ఈ ప్రయోజనాలు అమలు అవుతాయని తెలిపింది. ఇక నుంచి నిపుణులు ఎవరైనా స్పాన్సర్‌ లేకుండా నేరుగా యూఏఈకు వెళ్లి ఉద్యోగం సంపాదించుకొనే వెసులుబాలు కూడా కల్పించింది.

వీసా నిబంధనల్లో మార్పులు, చేర్పుల గురించి మేజర్‌ జనరల్‌ సుల్తాన్‌ యుసుప్‌ అల్‌ నువామి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారినర్స్‌ అఫైర్స్‌ అధారిటి కొత్త అప్‌డెటెడ్‌ వీసా నిబంధనల గురించి వివరించారు. కొత్త వీసా నిబంధనలు అమల్లోకి తేవడం వల్ల యూఏఈ ఆర్థికకంగా బలోపేతం అవుతుందన్నారు. వీసా నిబంధనలు సడలించడం వల్ల నిపుణులైన కార్మికులను ఆకర్షించవచ్చునని, అనుభవజ్ఞలైన వారితో పాటు క్రియేటివ్‌ పీపుల్స్‌ను ఆకర్షించవచ్చునని దీంతో ప్రాడెక్టివిటి పెంచుకోవచ్చునని… కొత్త వీసా నిబంధనల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వారు వివరించారు. అప్‌ డేటెడ్‌ వీసా సిస్టమ్‌ వల్ల ఇక్కడ నివాసం ఏర్పరచుకోవాలనే వారి ముందు పలు ఆప్షన్స్‌ అందుబాటులో ఉంచుతామన్నారు. ఎవరి అవసరాల మేరకు వారు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని అల్‌ నుమాని అన్నారు. వివిధ రకాల వీసాలను అందుబాటుల ఉంచామని వాటిలో ఇన్వెస్టర్లు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌, టాలెంటెడ్‌ సైంటిస్టులు, స్పెషలిస్టులు, స్టూడెంట్స్‌, గ్రాడ్యయేట్స్‌, మానవతావాదులు, రక్షణ రంగానికి చెందిన వారు, నిపుణులైన కార్మికులు అన్నీ రంగాలకు చెందిన వారు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.. గతంలో ఉన్న నిబంధనలు సరళీకరించడంతో పాటు కొత్తగా మరిన్ని ప్రయోజనాలను కూడా అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. అలాగే ఇక్కడ నివాసం ఉంటున్న వారు విడిగా ఉండవచ్చు. గతంలో యజమాని లేదా స్పాన్సర్‌ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వచ్చేది. కొత్త వీసా నిబంధనల ద్వారా ఉద్యోగాల కోసం యూఏఈ వచ్చే వారికి నాణ్యమైన, మెరుగైన జీవితం లభిస్తుంది. కొత్త అనుభూతిగా కనిపిస్తుంది.. కొత్త వీసా నిబంధనల వల్ల యూఏఈలో పనిచేయడం లేదా పెట్టుబడులు పెట్టడం ఆసక్తికరంగా మారుతుందని యూఏఈ ఉన్నతాధికారులు తెలిపారు.

విదేశీ నిపుణలు యూఏఈకి వచ్చి ఇక్కడ నివాసం ఉండాలనే వారి కోసం ఈ నెల 3వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వారి కోసం గ్రీన్‌ వీసా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ వీసా కాలపరిమితి ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది. అటు తర్వాత వాటిని రెన్యూవల్‌ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. గ్రీన్‌ వీసా ద్వారా యూఏఈకి వచ్చిన ఉద్యోగి తన కుటుంసభ్యులను కూడా ఇక్కడికి తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది. అలాగే వీసా కాలపరిమితి ముగిసిన తర్వాత ఆరు నెలల వరకు వీసా పొడిగించే వెసులుబాటు ఉంటుంది. అలాగే వీసా రద్దు అయినా ఆరు నెలల పాటు గ్రేస్‌ పీరియెడ్‌ ఇవ్వడం జరుగుతుందని మేజర్‌ జనరల్‌ కామిస్‌ అల్‌ కాబీ , ఐసీపీ సపోర్టు డైరెక్టర్‌ జనరల్‌ చెప్పారు.

కొత్త వీసా నిబంధనల వల్ల ఇండియా, పాకిస్తాన్‌, పిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. అయితే ఇక్కడ ఉద్యోగాల కోసం వచ్చే వారికి ఎన్ని సంవత్సరాల పాటు వీసా ఇస్తారనేది మాత్రం ఖచ్చితంగా తెలియజేయలేదు. ఇక్కడ ప్రధానంగా నిపుణులైన యువతతో పాటు స్కిల్స్‌ ప్రొఫెషనల్స్‌ ప్రపంచంలోని టాప్‌ 500 యూనివర్శిటీల్లో చదవి గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందిన వారిని ఆకర్షించడానికి ఈ వీసాలు జారీ చేసింది జాబ్‌ మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వీసా కోసం స్పాన్సర్‌ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే అంశాన్ని పూర్తిగా ఎత్తివేయడం స్వాగతించదగినదని చెబుతున్నారు. తాజా వీసా నిబంధనలతో భారత్‌, బంగ్లా, పాక్‌ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందంటున్నారు జాబ్‌ మార్కెట్‌ నిపుణులు.

Exit mobile version