Site icon Prime9

Fire Accident : జోహన్నెస్‌బర్గ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 58 మంది మృతి, 43 కి గాయాలు

Fire Accident at Johannesburg leads to 52 dead and 43 injured

Fire Accident at Johannesburg leads to 52 dead and 43 injured

Fire Accident : దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ జోహన్నెస్‌బర్గ్‌లోని ఐదంతస్తుల భవనంలో అనుకోని రీతిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 58 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అత్యవసర సేవల అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య 43కి చేరుకుందని అధికార ప్రతినిధి రాబర్ట్ ములౌద్జీ తెలిపారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ “మేము 58 మృతదేహాలను గుర్తించాము.. 43 మందికి స్వల్ప గాయాలయ్యాయి” అని వెల్లడించారు. అత్యవసర సేవలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారని పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎస్‌ఏబీసీ నివేదించింది. అయితే మంటలు చాలా వరకు ఆరిపోయాయని..  బిల్డింగ్ కిటికీల నుంచి పొగలు ఇంకా బయటకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version