Site icon Prime9

Elon Musk Old Video: ప్రపంచాన్ని ఇంటర్ నెట్ శాసిస్తుంది.. 25ఏళ్ల క్రితం మస్క్ చెప్పిన వీడియో వైరల్

1200-employees-resigns-to-twitter

1200-employees-resigns-to-twitter

Elon Musk Old Video: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ గురించి అందరికి తెలిసిందే. టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి వ్యాపారలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన 25 ఏళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకి ఆ వీడియోలో ఏముంది అంటారా..? ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎలా శాసిస్తుందో 25 ఏళ్ల క్రితమే చెప్పారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రపంచాన్ని ఇంటర్ నెట్ శాసిస్తుంది.. (Elon Musk)

సంచలన నిర్ణయాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు ఎలాన్ మస్క్. వివిధ రంగాలపై ఎప్పటికప్పుడు ముందస్తు అంచనాలను వెలువరుస్తూంటారు. వీటితో విజయవంతమైన బిజినెస్‌మెన్‌ గా ఎదిగేందుకు ఆయనకు ఇవే దోహదపడ్డాయని వ్యాపారరంగ నిపుణులు చెబుతుంటారు. ఇదే క్రమంలో.. ప్రపంచాన్ని ఇంటర్నెట్‌ ఎలా శాసిస్తుందనే విషయాన్ని మస్క్.. 25 ఏళ్ల క్రితమే ఊహించి చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

1988 ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ మాట్లాడారు. ప్రపంచాన్ని ఇంటర్ నెట్ ఎలా శాసిస్తుంది అనే అంశంపై.. మస్క్ అప్పట్లోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీబీఎస్ సండే మార్నింగ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంటర్నెట్ ప్రభావం గురించి ఆయన వివరించారు. ఇంటర్నెట్ మీడియాను మించిపోతుందని.. అన్ని రకాల మీడియాలు అంతరించిపోతాయని మస్క్ అన్నారు. ఫ్రింట్, టీవీ, రేడియో సహా.. అన్ని మీడియాలు ఇంటర్నెట్ లో రావడాన్ని చూడొచ్చు అని పేర్కొన్నారు. ఇంటర్నెట్ లో వినయోగదారులు చూడాలనుకున్నది చూడవచ్చు అని.. ఇది అన్ని సాంప్రదాయ మీడియాలను మారుస్తుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. వినియోగదారులు తమకు ఏది కావాలో.. దానిని ఎంచుకోవచ్చని మస్క్ తెలిపారు. సంప్రదాయ మీడియాలో ఇదో విప్లవం కానుందని మస్క్ అప్పట్లోనే చెప్పాడు.

ఎలాన్ మస్క్ పాత వీడియోను షేర్ చేశారు. ఇది ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఇప్పటికే 20 లక్షల మంది ఈ వీడియోను చూశారు. వేలల్లో ఈ వీడియోకు లైకులు కొడుతున్నారు. ఎలాన్ మస్క్ దూర దృష్టి కలవాడని.. నెటిజెన్లు అంటున్నారు. 25 ఏళ్లక్రితం చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అవుతున్నాయని.. కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో పై ఎలాన్ మస్క్ స్పందించారు. చాలాకాలం.. అది ఎప్పుడు..? అని ట్విట్ చేశారు. దీనికి టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ బదులిస్తూ క్లిప్ 1998లో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలోనిది అని చెప్పారు.

Exit mobile version