Site icon Prime9

Donald Trump : ఒకే ఒక్క ఓటుతో నవ్వుల పాలైన డొనాల్డ్ ట్రంప్..

Donald Trump

Donald Trump

Donald Trump : డొనాల్డ్ ట్రంప్ .. ఈ పేరు తెలియని వారుండరు. తనదైన వ్యవహార శైలి.. వింత చేష్టలతో ఎప్పడూ వార్తల్లో ఉంటారు. తాజాగా జరిగిన ఓ ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచారు అమెరికా మాజీ అధ్యక్షుడు. అగ్రరాజ్యాధిపతిగా పనిచేసిన ట్రంప్.. అమెరికా కాంగ్రెస్‌ లోని ప్రతినిధుల సభలో స్పీకర్ గా గెలవలేకపోయారు. అయితే ఏదో ఒకటి, రెండు ఓట్లతో ఆయన పరాజయం పాలైతే పెద్దగా చర్చించుకోవాల్సిన పనిలేదు. కానీ ఈ ఎన్నికల్లో ట్రంప్ కు వచ్చింది ఒకే ఒక్క ఓటు. మొత్తం 430 మంది సభ్యులన్న ప్రతినిధుల సభలో ట్రంప్ పోలైన ఒకే ఒక ఓటు ను ప్రకటించగానే సభలోని సభ్యులంతా పగలబడి నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

స్పీకర్‌గా సేవలందించాలనుకునే వ్యక్తులను సభ ఎన్నుకుటుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెవిన్ మెక్‌కార్తీని పోటీకి దిగారు.

430 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో స్పీకర్‌గా ఎన్నిక కావాలంటే 218 ఓట్లు రావాలి.

నిజానికి సభలో రిపబ్లికన్‌ పార్టీకి స్వల్ప మెజార్టీ ఉండటంతో కెవిన్‌ మెకార్తీని ఈజీగా గెలవాల్సింది.

అయితే, సుమారు 20 మంది రిపబ్లికన్లు ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించలేదు.

దీంతో అభ్యర్థిని ఎన్నుకునేందుకు 3 రోజులుగా తంటాలు పడుతున్నారు.

ఈ క్రమంలోనే మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు రేసులోకి వచ్చింది.

ట్రంప్ పేరును ఆ పార్టీకి చెందిన ఓ నేత నామినేట్‌ చేయగా.. ఆయనకు ఒకే ఒక్క ఓటు వచ్చింది.

వైరల్ గా మారిన ఒక్క ఓటు వీడియో…

11వ రౌండ్‌ ఓటింగ్‌ నిర్వహించే క్రమంలో రిపబ్లికన్‌ సభ్యుడు మాట్ గేట్జ్ ట్రంప్‌ పేరును ఆయన నామినేట్‌ చేశారు. ఓటింగ్‌ నిర్వహించగా ట్రంప్‌‌కు అనుకూలంగా ఒకే ఒక్క ఓటు వచ్చింది. అది కూడా మాట్‌ గేట్జ్‌ వేసిందే. 11వ రౌండ్‌ ఎన్నిక ఫలితాన్ని హౌస్‌ క్లర్క్ వెల్లడిస్తూ.. ట్రంప్‌‌కు ఒకే ఒక్క ఓటు పోలైందని చెప్పగానే సభ అంతా నవ్వులతో గొల్లుమంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్టు ట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్‌ అవుతోంది.

కాగా, నూతర స్పీకర్ గా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెవిన్ మెక్ కార్తీని ఎన్నికయ్యారు. గత 3 రోజులుగా కొనసాగిన అనిశ్చితికి తెర దించుతూ మెక్ కార్తీ కి మద్దతు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ లో నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా స్పీకర్ ఎన్నిక 15 రౌండ్ల వరకు వెళ్లింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version