Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని హత్య చేయాలని ఓ యువకుడు చేసిన యత్నం కలకలం రేపింది. ట్రక్కుతో వైట్ హౌస్ పరిసరాల్లోకి దూసుకొచ్చి బారికేడ్లను ఢీ కొట్టాడు. అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడిని హత్య చేయాలన్న లక్ష్యంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు యువకుడు ఒప్పుకున్నాడు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని హత్య చేయాలని ఓ యువకుడు చేసిన యత్నం కలకలం రేపింది. ట్రక్కుతో వైట్ హౌస్ పరిసరాల్లోకి దూసుకొచ్చి బారికేడ్లను ఢీ కొట్టాడు. అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడిని హత్య చేయాలన్న లక్ష్యంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు యువకుడు ఒప్పుకున్నాడు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద ట్రక్కుతో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు.
ఈ ఘటనలో తెలుగు సంతతి 19 ఏళ్ల యువకుడు కందుల సాయి వర్షిత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకివ వచ్చాయి.
జో బైడెన్ ను హత్య చేయాలనే లక్ష్యంతో ఈ దాడికి పాల్పడినట్లు యువకుడు విచారణలో ఒప్పుకున్నాడు.
దీని కోసం ఆ యువకుడు ఆరు నెలలుగా ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది.
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించారు.
ఇక సాయి వర్షిత వద్ద పోలీసులు నాజీ జెండాను స్వాధీనం చేసుకున్నారు. ఈ జెండాను ఆన్ లైన్ లో కొనుగోలు చేసినట్లు.. నిందితుడు వివరించాడు.
హిట్లర్ బలమైన నేత. నాజీలకు గొప్ప చరిత్ర ఉంది. అని అతడు చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో, సాయి వర్షిత్ మానసిక పరిస్థితిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇందుకోసం అతడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను విచారించినట్లు తెలుస్తోంది.
మిస్సోరిలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌ది భారత సంతతికి చెందిన కుటుంబం. 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజీలపై పట్టున్న అతడు.. డేటా అనలిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలని చూస్తున్నట్లు అతడి లింక్డిన్ ప్రొఫైల్ ద్వారా తెలిసింది.
కాగా.. నిందితుడిపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేదని పోలీసులు వెల్లడించారు.