Site icon Prime9

Chinese Spy Ship in Sri Lanka: శ్రీలంక తీరంలో చైనా గూఢచారి నౌక.. భారత్ అభ్యంతరాలను ఖాతరు చేయని లంక

Chinese Spy Ship in Sri Lanka: చైనాకు చెందిన గూఢచార నౌక శ్రీలంకకు చేరింది. శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టుకు ఈ ఉదయం చేరుకున్న ఈ నౌకపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ గూఢచార నౌకకు శాటిలైట్లను, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేసే సత్తా ఉండటంతో భారత్ వ్యతిరేకతను తెలిపింది. ఈ బాలిస్టిక్ మిస్సైల్, శాటిలైట్ ట్రాకింగ్ షిప్ పేరు యువాన్ వాంగ్-5. ఈ నౌక ఉదయం 8.40 గంటలకు శ్రీలంకకు చేరుకుందని హార్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ దీ సిల్వా వెల్లడించారు.

మరోవైపు, తమ సముద్ర జలాల్లో ఎలాంటి రీసెర్చ్ చేయబోమనే కండిషన్ పై ఈ నౌకను శ్రీలంక అనుమతించిందని పోర్టు అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు, చైనా గూఢచార నౌక పొరుగున్న ఉన్న శ్రీలంకకు చేరుకోవడంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇండియన్ ఇన్స్టలేషన్స్ ను ట్రాక్ చేసే అవకాశం ఉందని భారత్ అనుమానిస్తోంది.

వాస్తవానికి అత్యాధునికి ఈ నౌకను తమ దేశానికి తీసుకొచ్చే ఆలోచనను వాయిదా వేసుకోవాలని ఇంతకు ముందు చైనాను శ్రీలంక కోరింది. అయితే, హఠాత్తుగా నిర్ణయాన్ని మార్చుకుని నౌకకు క్లియరెన్స్ ఇచ్చింది. మరోవైపు, చైనా నౌక వచ్చిన నేపథ్యంలో శ్రీలంక విదేశాంగ శాఖ స్పందించింది. భారత్ రక్షణ తమకు అత్యంత ప్రధానమైనదని తెలిపింది. భారత్ కోరుకుంటున్న విధంగానే యువాన్ వాంగ్ ను హ్యాండిల్ చేస్తామని చెప్పింది. ఇరు దేశాల సార్వభౌమత్వాలను కాపాడుతామని తెలిపింది.

Exit mobile version