China Accident : తూర్పు చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా చలి తీవ్రత పెరగడంతో ముందు ఉన్నవారిని సైతం గుర్తుపట్టలేనంతగా పొగ మంచు కమ్మేస్తోంది. దీంతో పలు వాహనాలు ఒకదాని ఒకటి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
నాన్ చాంగ్ కౌంటీ లో జరిగిన ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా వాహనదారులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. పొగమంచు వల్ల ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించడం లేదని..ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందు ప్రయాణిస్తున్న వాహనానికి తగినంత దూరంలో ఉండాలని హెచ్చరించారు. లైన్ మారడం, ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించవద్దని సూచించారు.
కాగా, చైనాలో తగిన సేఫ్టీ కంట్రోల్స్ లేకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో సెంట్రల్ చైనాలో ఓ బ్రిడ్జిపై వందలాది వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదం కూడా పొగమంచు కారణంగా సంభవించింది. అదేవిధంగా గత సెప్టెంబర్ లో క్వారంటైన్ కేంద్రాలకు వెళ్తున్న బస్సు హైవేపై అదుపు తప్పడంతో 27 మంది మృతి చెందారు. మొత్తానికి ఈ చైనా ప్రమాదం ఘటన విషాదాన్ని నింపింది.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/