ChatGPT On War: చాట్ జీపీటీ.. ఇప్పుడు ప్రపంచమంతా ప్రధానంగా దీని గురించే మాట్లాడుకుంటోంది. చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి సరికొత్త సంచలనమే అని చెప్పుకోవచ్చు. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఈ ఔపెన్ ఏఐ చాట్ బాట్ కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ఎలాంటి ప్రశ్నకైనా క్షణాల్లో బదులిస్తోంది ఈ టూల్. దీంతో చాలా మంది తమకు కావాల్సిన సమాచారాన్ని చాట్ జీపీటీ ని అడిగి తెలుసుకుంటున్నారు.
తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి వికాస్ స్వరూప్ ఈ టూల్ ను పరీక్షించారు. ఆయన అడిగిన ప్రశ్నకు.. చాట్ జీపీటీ కూడా అదే రీతిలో సమాధానమిచ్చింది.
ఇంతకీ ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే.. ఉక్రెయిన్-రష్యా యుద్దంలో మధ్యవర్తిత్వ ప్రణాళిక గురించి ఆయన అడిగారు. ఈ ప్రశ్నకు చాట్ జీపీటీ పెద్ద సమాధానమే ఇచ్చింది.
కాగా, ఉక్రెయిన్-రష్యా యుద్దానికి ఈ టూల్ ఇచ్చిన సమాధాన మేంటీ? అనుకుంటున్నారా..‘స్వరూప్ అడిన ప్రశ్నకు బదులుగా.. ఉక్రెయిన్-రష్యా మధ్య ఘర్షణలు చాలా క్లిష్టమైనది,
సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి. ఈ అంశంపై ఇరు పక్షాలకు సరిపోయే పరిష్కారాన్ని కనుక్కోవడం కాస్త ఛాలెంజ్ అయిన విషయమే.
అయితే, చర్చలు, కాల్పులు విరమణ , అధికార వికేంద్రీకరణ, ఇరు దేశాల ఒప్పందాలను పాటించడంపై అంతర్జాతీయ పర్యవేక్షణ, ఆర్థిక సహకారం, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గుర్తించడం,
సంస్కృతి సంప్రదాయాల పర్యవేక్షణ, సైనిక బలగాల ఉపసంహరణ.. లాంటి 8 అంశాలను పాటిస్తే యుద్దానికి పరిష్కారం లభించే అవకాశముంది’ అని సమాధానం ఇచ్చింది.
ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధంగా మారుతున్న ఉక్రెయిన్- రష్యా వార్ పై చాట్ జీపీటీ ఇచ్చిన జవాబును వికాస్ స్వరూప్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.
Can AI solve the world’s biggest conflict? I asked ChatGPT to come up with a mediation plan for the Russia-Ukraine War. This is what it came up with. pic.twitter.com/KUSSFXZbxU
— Vikas Swarup (@VikasSwarup) March 5, 2023
స్వరూప్ ట్వీట్‌కు పలువురు ప్రముఖులు కూడా స్పందించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఈ పోస్ట్ పై కామెంట్ చేస్తూ ఓ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తారు.
‘వికాస్ స్వరూప్ తీసుకున్న చొరవ ఇంట్రెస్టింగ్ . కానీ, ఆ ఇరు దేశాల అధినేతలు పుతిన్, జెలెన్‌స్కీలు కృత్రిమ మేధ అంచనాలకు మించి ప్రవర్తించేవాళ్లు.
ఈ యుద్ధం గురించి చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానంపై ఇరు దేశాల నుంచి అభ్యంతరాలు రావచ్చు.
మరీ ముఖ్యంగా రష్యన్ల నుంచి.. కానీ ఇది గొప్ప ప్రయత్నం’ అని థరూర్ స్పందించారు.