Site icon Prime9

ChatGPT: వాళ్లంతా వివాదాస్పద వ్యక్తులే అంటున్న చాట్ జీపీటీ

ChatGPT

ChatGPT

ChatGPT: టెక్నాలజీ రంగంలో చాట్‍ జీపీటీ ఇపుడో సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ ఏఐ చాట్‌బోట్ హాట్‍టాపిక్‍గా ఉంది. ఎలాంటి ప్రశ్నలకైనా దాదాపు కచ్చితమైన సమాధానాలు ఇవ్వడం దీని ప్రత్యేకత. అంతేకాదు, మన వ్యక్తిగత సమస్యలపైనా ఇది సలహాలు, సూచనలు ఇవ్వగలదు.

ఈ చాట్‌బోట్‌తో మనం కొత్త కంటెంట్‌ కూడా సృష్టించొచ్చు. ఈ క్రమంలో యూజర్లు చాట్ జీపీటీ తో మాట్లాడుతూ.. నిజంగా చాట్ జీపీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటున్నారు.

అయితే ఓ యూజర్ ప్రపంచ బిలియనర్, ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ గురించి అడగ్గా.. దానికి చాట్ జీపీటీ చెప్పిన సమాధానం ఒకింత షాకింగ్ గా ఉంది.

వారంతా వివాదాస్పద వ్యక్తులే(ChatGPT)

వరల్డ్ వైడ్ గా ప్రముఖ వ్యక్తుల గురించి చాట్ జీపీటీ ఎలాంటి సమాధానాలు ఇచ్చిందో.. ఐజాక్ అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అందులో ఎలాన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, బోరిస్ జాన్సన్, నటి కిమ్ కర్ధాషియన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వంటి వాళ్లను కాంట్రవర్సియల్( వివాదాస్పద) వ్యక్తులుగా అభివర్ణించింది.

అదే విధంగా ఈ వ్యక్తులను ప్రత్యేకంగా పరిగణించాలని కూడా పేర్కొంది. అమెరికా జో బైడెన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ లు కాకుండా.. డొనాల్డ్ ట్రంప్, మస్క్ లను

ప్రత్యేకమైన వ్యక్తులుగా పరిగణించవచ్చని చాట్ జీపీటీ పేర్కొంది.

కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్ పింగ్ , నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ లాంటి వారిని కూడా ప్రత్యేకమైన వ్యక్తులుగా పరిగణించాలని చాట్ జీపీటీ తెలిపింది.

అయితే చాట్ జీపీటీ సమాధానాలను సోషల్ మీడియాలో ఐజాక్ లో షేర్ చేయగా.. వాటిపై మస్క్ వెరైటీగా స్పందించారు.

ఆశ్యర్యానికి గురి అవుతున్నట్టుగా రెండు ఆశ్యర్యార్థకాలను(!!) పోస్ట్ చేశారు. మస్క్ ఇచ్చిన స్పందనపై నెటిజన్లు కూడా రియాక్ట్ అయ్యారు.

అయితే పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా చాట్ జీపీటీ సమాధానాలు ఇస్తోందని పలువురు అభిప్రాయ పడ్డారు.

మిలియన్ల యూజర్స్ తో

ప్రపంచమంతా ప్రస్తుతం ఈ చాట్ జీపీటీ గురించే చర్చ జరుగుతోంది. లాంచ్ అయిన మూడు నెలల్లోనే మిలియన్ల మంది యూజర్లు దీనిని వినియోగిస్తున్నారు.

దీంతో టెక్నాలజీ రంగంలో ఇదో సంచలనంగా మారింది. చాట్ జీపీటీని కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే అధునాతన చాట్‍బోటే ఈ ‘చాట్ జీపీటీ’. దీని పూర్తి పేరు చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్.

అధునాతన మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో చాట్‍ జీపీటీ పని చేస్తుంది. ఈ చాట్ జీపీటీని ఏ ప్రశ్న అయినా టెక్స్ట్ రూపంలో అడగవచ్చు.

ఆ ప్రశ్నకు ఈ ఏఐ టూల్ వివరమైన సమాధానాన్ని అత్యంత వేగంగా, వివరంగా ఇస్తుంది. దానికి కారణం చాట్ జీపీటీలో ఎంతో అపారమైన డేటా బేస్ ఉంది.

దాని సహాయంతోనే ఏ ప్రశ్నకైనా ఇది ఆన్సర్ చెప్పేస్తోంది.

Exit mobile version