Prime9

Bus Accident : మెక్సికోలో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి, 22 మందికి తీవ్రగాయాలు.. భారతీయులు కూడా

Bus Accident : మెక్సికో దేశంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నాయారిట్ రాష్ట్రంలో రాజధాని టెపిక్‌కు కొద్ది దూరంలో ఉన్న బర్రాంకా బ్లాంకా ప్రాంతంలో రహదారి నుంచి బస్సు లోయలో పడిపోయింది. 40 మంది ప్రయాణికులతో టియువానా వైపు వెళుతున్న బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి 164 అడుగుల లోతున్న లోయలో పడిపోయిందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారిలో ముగ్గురు పిల్లలు, 14 మంది పెద్దలున్నారని సమాచారం అందుతుంది. అలానే మృతుల్లో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారని తెలుస్తుంది. వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ ప్రొటెక్షన్, అగ్నిమాపక శాఖ సిబ్బంది అంబులెన్సులతో అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Mexico Bus Accident

Exit mobile version
Skip to toolbar