Site icon Prime9

Pakistan Blast: పాక్ మసీదులో బాంబు పేలుడు.. 28మంది మృతి, 150మందికి గాయాలు

bomb attack

bomb attack

Pakistan Blast: పాకిస్థాన్ లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 28 మంది మృతి చెందారు. మరో 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

పాకిస్థాన్ లో (Pakistan) ముష్కరులు మరోసారి చెలరేగిపోయారు. మసీదు లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పెషావర్‌ లోని ఓ మసీదులో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 28మంది మృతిచెందారు. మరో 150మందికి పైగా గాయపడినట్టు సమాచారం.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

పెషావర్‌లోని పోలీస్‌ లైన్స్‌ ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రార్థనల సమయంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే.. సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పేలుడు జరిగిన ప్రదేశాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటన స్థలానికి కేవలం అంబులెన్సులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ పేలుడు ధాటికి  మసీదు చాలా మేరకు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.

పేలుడు ప్రభావానికి మసీదు ప్రాంతం కుప్పకూలగా.. ఆ శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఉగ్రదాడి జరిగిందా.. ఆత్మాహుతి దాడి జరిగిందా?

గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. షియా మసీదులో జరిగిన దాడిలో 63మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మసీదులో బాంబు పెట్టారా.. లేదా ఆత్మాహుతి దాడి జరిగిందా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.

మసీదు వైపు రోడ్లను మూసీవేసిన అధికారులు.. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు.

బాంబు పేలిన ఘటనపై.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ Imran Khanస్పందించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ దాడిలో మరణించిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. దేశంలో ఉగ్రవాద ముప్పును అరికట్టాలని కోరారు.

ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన దేశ ప్రధాని.

మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ.

ఈ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version