boat Accident: ఓవర్ లోడ్ తో బోల్తా పడిన పడవ.. 145 మంది మృతి

Boat Accident: వాయువ్య డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. లులోంగా నదిలో 200 ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఓవర్ లోడు కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ పడవ ప్రమాదంలో దాదాపు 145 మంది మృతి చెందినట్టు అక్కడి అధికారులు తెలిపారు. మిగిలిన 55 ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయట పడినట్లు వెల్లడించారు.

ఈ మోటరు బోటు లులోంగా నదిలో రాత్రిపూట వస్తువులు, జంతువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా బసన్ కుసు పట్టణ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం, వారితో పాటు ఎక్కువ లగేజ్ ఉండటంతో లోడు ఎక్కువై పడవ ఒక్కసారిగా మునిగిపోయింది.

ఇతర మార్గాలు లేకపోవడంతో

ఈ ప్రమాదంలో 145 మంది తప్పిపోయారని, వారి ఆచూకీ ఇంకా తెలియ లేదని స్థానిక సివిల్ సొసైటీ సభ్యులు తెలిపారు.

ఈ ప్రాంతంలో రెస్క్యూ టీమ్ లు కూడా పరిమితంగా ఉన్నాయన్నారు. అధిక లోడుతో వెళ్లడమే ప్రమాదానికి కారణమన్నారు.

ప్రస్తుతం తమ ప్రాంతంలో ఇతర రవాణా మార్గాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులకు పడుతున్నట్టు వారు వెల్లడించారు.

 

తరచూ పడవ ప్రమాదాలు(Boat Accident)

కాగా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగ్ (డీఆర్ సీ)లో తరచూ పడవ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. దీనికి కారణం ఇక్కడ రోడ్డు మార్గాలు లేకపోవడంతో ప్రజలు ఎక్కువగా పడవ ప్రయాణాలు చేస్తుంటారు.

ఇక్కడి వలసదారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి జల మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ క్రమంలో తరచుగా ఇక్కడ పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి.

గత అక్టోబర్ లో ఈక్వెటూర్ ప్రావిన్స్ లోని కాంగో నదిలో పడవ ప్రమాదం జరిగి 40 మంది పైగా మృతి చెందారు.

ఈత రాకపోయినా అక్కడి ప్రజలకు పడవల్లో ప్రయాణించడం తప్పనిసరి దానితో తరచూ వారు పడవ ప్రమాదాలకు గురవుతుంటారు.

ఇదిలా ఉంటే ప్రమాద విషయం తెలుసుకుని, రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని వారిని రక్షించడం అనేది కూడా చాలా లేటుగా జరగడంతో మరణాల సంఖ్య పెరుగుతోందని అక్కడి స్థానికులు అంటున్నారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/