Australian Police: ఆస్ట్రేలియాలో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశ పోలీసులు జరిపిన కాల్పుల్లో భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మమ్మద్ రెహ్మతుల్తా సయ్యద్ అహ్మద్ ఈ కాల్పుల్లో మృతి చెందాడు. ఈ సంఘటన ఇండియన్ ఎంబసీ కూడా స్పందించింది.
క్లీనర్‌పై కత్తితో దాడితో నే( Australian Police)
తమిళనాడుకు చెందిన సయ్యద్ అహ్మద్(32) బ్రిడ్జింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. అయితే, మంగళవారం సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడవడానికి సయ్యద్ ప్రయత్నించాడు. అంతే కాకుండా సయ్యద్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డాడు.
సయ్యద్ అహ్మద్ ను కంట్రోల్ చేసే క్రమంలో అతనిపై పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో రెండు బుల్లెట్స్ అతడి గుండెల్లోకి దూసుకెళ్లాయి. అనంతరం, పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సయ్యద్ అహ్మద్ మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు.
తీవ్రవాద దాడిగా పరిగణించలేం: పోలీసులు
కాగా, సయ్యద్ అహ్మద్‌పై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని సిడ్నీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను తీవ్రవాద దాడిగా పరిగణించడం లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మరో వైపు, సయ్యద్ మృతిపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది.
ఇది చాలా దురదృష్టకరమైన విషయమని ఆవేదన వ్యక్త పరిచింది. అలాగే, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతో పాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్టు పేర్కొంది.