Adani: హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై తొలిసారి గౌతమ్ అదానీ గ్రూప్ స్పందించింది. దీనిపై వివరణ ఇస్తూ 413 పేజీల స్పందనను తెలియజేసింది. హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికించింది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. ముఖ్యంగా అదానీ గ్రూపు లక్షల కోట్లు నష్టపోయింది. అయితే ఈ నివేదికపై తాజాగా అదానీ గ్రూప్ స్పందించింది.
ఈ నివేదికపై వివరణ ఇచ్చిన అదానీ గ్రూపు పలు ఆరోపణలు చేసింది. భారత్ వృద్ధిపై అక్కసుతోనే ఇలాంటి ఆరోపణలు చేసిందని తెలిపింది. భారతీయ సంస్థలు సాధిస్తున్న వృద్ధి చూడలేకనే.. ఇలాంటి అసత్య ఆరోపణలు చేసిందని వివరించింది. ఇవి పూర్తిగా అసత్య ఆరోపణలు అంటూ.. 413 పేజీల స్పందనను తెలియజేసింది.
మార్కెట్‌లో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి.. ఆర్థిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో హిండెన్ బర్గ్ నివేదిక ఇచ్చినట్లు అదానీ గ్రూపు పేర్కొంది.
వారికి నచ్చిన విధంగా.. తప్పుడు సమాచారంతో నివేదిక రూపొందించారని ఆరోపించింది.
ఇలా అసత్య ఆరోపణలతో.. దాడులు చేయడం సరికాదని అదానీ గ్రూప్ అభిప్రాయపడింది.
ఇలా చేయడం ద్వారా.. జాతీయ సమగ్రతకు భంగం కలుగుతుందని.. దేశం ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని వివరణ ఇచ్చారు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీఓకు ముందు ఇలా.. నివేదికను విడుదల చేయడం ఏంటని ప్రశ్నించింది.
సరైన కారణాలు లేకుండా.. ఎలాంటి పరిశోధన చేయకుండా ఎలా నివేదిక విడుదల చేసిందని ప్రశ్న లేవనెత్తింది.
హిండెన్‌బర్గ్ నివేదికలో 88 ప్రశ్నలకు గాను 65 ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలిపింది.
మరో 23 ప్రశ్నల్లో 18 ప్రశ్నలు వాటదారులవని పేర్కొంది. మిగతా.. అయిదు ప్రశ్నలు నిరాధారమైనవని తెలిపింది.
కార్పొరేట్ లో వర్తించే చట్టాలు.. నిబంధనలను తప్పకుండా పాటిస్తున్నామని తెలిపింది.
వాటాదార్ల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఈ సందర్భంగా అదానీ గ్రూపు ప్రకటించింది. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించడమే తమ లక్ష్యమని పేర్కొంది.
అదానీ గ్రూపు కంపెనీలో ఎల్‌ఐసీ రూ.28,400 కోట్లు పెట్టుబడి పెట్టింది.
హిండెన్‌బర్గ్ నివేదికకు ముందు దీని విలువ.. రూ.72,200 కోట్లు ఉండేది. అయితే అదానీ షేర్లు పతనం కావడంతో.. ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.55,700 కోట్లకు వచ్చింది.
దీని ప్రకారం.. రూ.28,400 కోట్ల పెట్టుబడితో పోలిస్తే నికరంగా రూ.27,300 కోట్ల లాభంలోనే ఉంది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/