Turkey Earthquake: టర్కీలో 8వేలకు చేరిన మృతల సంఖ్య.. ఇళ్లే సమాధులుగా మారి..

టర్కీ, సిరియాలో సంభవించిన వరుస భూకంపాలు ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. భూకంపాల ధాటికి మరణిస్తున్న వారి సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. భూకంపాల్లో మరణించిన వారి సంఖ్య 8 వేలకు చేరుకున్నట్లుగా సమాచారం

Turkey Earthquake: టర్కీ, సిరియాలో సంభవించిన వరుస భూకంపాలు ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. భూకంపాల ధాటికి మరణిస్తున్న వారి సంఖ్య గంట గంటకు పెరుగుతోంది.

భూకంపాల్లో మరణించిన వారి సంఖ్య 8 వేలకు చేరుకున్నట్లుగా సమాచారం. కూలిపోయిన భవన శిథిలాల కింద పడి గాయపడిన వారి సంఖ్య సుమారు 25వేలు దాటినట్లుగా అక్కడి మీడియా పేర్కొనింది.

భారత్ నుంచి సాయం

టర్నీ భూకంపాలపై స్పందించి ప్రధాని మోదీ భూకంప బాధితులకు వైద్య సేవలందించేందుకుగానూ భారత ఆర్మీకి చెందిన 89మంది మెడికల్ సిబ్బందిని పంపింది.

ఆగ్రాకు చెందిన ఆర్మీ హాస్పిటల్ సైన్యం ఇప్పటికే టర్కీకి ((Turkey Earthquake))చేరుకుంది. భారత ప్రభుత్వం నుంచి వెళ్లిన ఈ ప్రత్యేక మెడికల్ ఎమర్జెన్సీ, మరియు క్రిటికల్ కేర్ స్పెషాలిటీ బృందంలో ఆర్ధోపెడిక్ సర్జన్స్, జనరల్ మెడికల్ సర్జన్స్‌ ఉన్నారు.

భూకంప బాధితులకు వైద్య సేవలతో పాటు అవసరమైన మెడికల్ హెల్ప్ అందించే పనిలో ఈ ఎమర్జెన్సీ బృందం నిమగ్నమయ్యారు.

అక్కడి భూకంప బాధితులకు అవసరమైన ఎక్స్‌రే ఎక్వీప్‌మెంట్, వెంటిలేటర్స్, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్, గుండె పనితీరును పరిశీలించే పరికరాలను భారత్ ఆర్మీ బృందం యుద్ధ విమానంలో తీసుకువెళ్లింది.

30 పడకల సామర్ధ్యం కలిగిన అత్యవసర మెడికల్ సర్వీసులు అందించే విధంగా ప్రత్యేక టీమ్ పనిచేస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత భారీ భూకంపం..

టర్నీ ప్రభుత్వం ప్రపంచంలో సంభవించిన అత్యంత భారీ భూకంపాలుగా వీటిని పేర్కొనింది.

ఒక్క టర్కీ లోనే 5వేల మంది చనిపోయినట్టు సుమారు 20వేల మందికిపైగా గాయపడ్డట్లుగా అక్కడి ప్రభుత్వం తెలిపింది.

ఇక సిరియాలో కూడా 2వేల మందికిపైగా చనిపోయి ఉంటారని..5 వేల మందికిపైగా క్షతగాత్రులు ఉండవచ్చని అక్కడి అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక ఈ రెండు దేశాల్లో కలిపి ఇప్పటి వరకూ 7,800మంది చనిపోగా.. బుధవారం నాటికి ఈ సంఖ్య మరింతగా పెరిగి 8వేలకు చేరిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ రెండు దేశాల్లో సంభవించిన భూకంపాలకు(Turkey Earthquake) భారీగా ఆస్తి నష్టం జరిగింది. 11వేలకు పైగా భవనాలు కుప్ప కూలిపోయాయి.

ఈ ప్రమాదంలో గాయ‌ప‌డ్డవారిని త‌ర‌లించేందుకు 10 నౌక‌లు, 54 విమానాలు రంగంలోకి దిగాయి. 25 మంది వర్కర్లు రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి.

టర్నీ, సిరియా ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నాయంటే కనీసం ఇప్పుడు అక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం లేనంత దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/