Site icon Prime9

Philips to cut 5% of workforce: ఫిలిప్స్ కంపెనీలో 4వేల ఉద్యోగాలు హుష్…

4000 jobs were cut in Philips company

4000 jobs were cut in Philips company

Amsterdam: ప్రముఖ అంతర్జాతీయ సంస్ధ ఫిలిప్స్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఉద్యోగుల సంఖ్యలో 5శాతం మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ఆ కంపెనీ సీఈఓ రాయ్ జాకోబ్స్ పేర్కొన్నారు. దీంతో 4వేల మందిని తొలగించక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు, కఠిన నిర్ణయమేనన్న సీఈవో, సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో తొలగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. గడిచిన మూడు నెలల విక్రయాల్లో ఫిలిప్స్ కంపెనీ విలువ 5శాతం తగ్గి 4.3 బిలియన్ యూరోలకు చేరిందన్నారు. కంపెనీ ఉత్పాదకాలను పెంచడం కోసమే ఉద్యోగాల తొలగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జాకోబ్స్ తెలిపారు.

తాజాగా తీసుకొన్న నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కంపెనీ విక్రయాలు తగ్గడానికి గల కారణాలు కూడా ఆయన తెలిపారు. సరఫరా వ్యవస్ధలోని సమస్యలు, ద్రవ్యోల్పణ ఒత్తిళ్లు, రష్యా-ఉక్రెయిన్ వార్, చైనాలో కరోనా వ్యాప్తి వంటి పలు అంశాలు కంపెనీ విక్రయాలపై ప్రభావం చూపాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ నెల 15న రాయ్ జాకబ్స్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కంపెనీ లావాదేవీలపై ఆయన దృష్షి సారించారు. ప్రపంచవ్యాప్తంగా ఫిలిప్స్ కంపెనీలో సుమారుగా 80వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rishad Premji: కీలక ఉద్యోగులనే తొలగించాం.. కంపెనీకి నిబంధనలే ముఖ్యం.. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ

Exit mobile version