Site icon Prime9

Crime News : “సరదా కోసం” జోకర్ వేషంలో 13 మందిని దారుణంగా చంపిన యువకుడు..

Crime News about young girl mudered by couple and turned into 30 pieces

Crime News about young girl mudered by couple and turned into 30 pieces

Crime News : సరదా.. కేవలం సరదా కోసం యువకులు సాధారణంగా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళడం.. విహారయాత్రలు, పార్టీలు అంటూ చేసుకోవడం మనం గమనించవచ్చు. కానీ కేవలం సరదా కోసం 13 మందిని విచక్షణ రహితంగా కాల్చి చంపాడు ఓ యువకుడు. చదవడానికి ఆశ్చర్యంగా, భయానకంగా అనిపిస్తున్న ఈ ఘటన జపాన్ లో చోటు చేసుకుంది. అయితే ఆ యువకుడు మామూలుగా కూడా కాకుండా జోకర్ వేషం వేసుకొని ఈ దారుణానికి పాల్పడడం మరో విచిత్రం అని చెప్పాలి.

బీసీ కామిక్స్ లోని ‘జోకర్’ క్యారెక్టర్ గురించి తెలియని వారు ఉండరు. తనకు జీవితంలో ఎదురైన అనేక పరాభవాల కారణంగా జోకర్ వేషంలో అతను హత్యలు చేస్తూ ఉంటాడు. దీన్ని స్పూర్తిగా తీసుకొని జోకర్ వేషం వేసుకొని.. తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 13 మందిని పొట్టన పెట్టుకున్నాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. 2021 హాలోవీన్ సమయంలో ఓ వ్యక్తి జోకర్ వేషంలో ట్రైన్ లోకి ఎక్కాడు. ఆ తర్వాత జోకర్ తరహాలో పిచ్చి గంతులేశాడు.. కానీ హాలోవిన్ కావడంతో అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఊహించని రీతిలో 70 ఏళ్ల వృద్ధుడిపై మొదట కత్తితో దాడి చేశాడు.

ఆ తరువాత గన్స్ బయటికి తీసి చుట్టూ ఉన్న ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. 12 మంది ప్రయాణికులు ఈ కాల్పుల్లో నిర్దాక్షిణ్యంగా మృతి చెందారు. దీంతో మిగతావారు తీవ్రంగా భయపడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. కాల్పులు జరిపిన తర్వాత అతను హఠాత్తుగా మాయమైపోయాడు. ఈ మారణకాండ కు పాల్పడిన వ్యక్తి ఎవరో కనిపెట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. సిసి ఫుటేజిని పరిశీలించారు. కానీ అందులో అతను జోకర్ వేషంలో ఉండడంతో.. ఆ ముసుగు వెనుక ఉన్నదెవరో తెలుసుకోలేకపోయారు. అయితే ఇటీవల ఈ దారుణానికి (Crime News) పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.

క్యోటా హటోరీ అనే 26 ఏళ్ల యువకుడు.. జోకర్ వేషంలో కాపులు జరిపినట్లు తేల్చారు. ఇక అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. ఎందుకు చంపావు అన్న ప్రశ్నకు అతడు చెప్పిన సమాధానం విని అందరూ షాక్ అయ్యారు. ఆ 13 మందిని ‘సరదా’కోసం చంపానని చెప్పుకొచ్చాడు. ప్రజల్ని చంపడం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. దీంతో అవాక్కయిన న్యాయమూర్తి ఈ కేసులో హటోరీని దోషిగా పరిగణిస్తూ 23 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇప్పుడు ఈ వార్త (Crime News) వైరల్ గా మారింది.

Exit mobile version