Pakistan: ఇస్లామిక్ మిలిటెంట్లు వాయువ్య పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌పైకి పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కును ఢీకొట్టడంతో 25 మంది మరణించగా 16 మంది గాయపడ్డారు. ఆత్మాహుతి బాంబర్లు సెక్యూరిటీ కాంపౌండ్‌పైకి చొరబడి, ప్రాంగణంలోని పేలుడు పదార్థాలను పేల్చారు. భద్రతా సిబ్బందిపై కూడా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగాయి.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని పోలీస్ స్టేషన్‌ను పాక్ సైన్యం బేస్ క్యామ్‌గా ఉపయోగించుకుంది. పలువురు ఉగ్రవాదులు మొదట ట్రక్కుతో స్టేషన్ సరిహద్దు గోడను ఢీకొట్టారు. మరికొందరు తుపాకులతో దాడి చేయడం ప్రారంభించారు.మూడు గదులు కూలిపోయాయని, శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
దాడి చేసింది మేమే..( Pakistan)
ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న గిరిజన ప్రాంతాలకు సమీపంలో జరిగిన దాడికి తాహ్రీక్-ఎ-జిహాద్ పాకిస్తాన్ (TJP) బాధ్యత వహించింది.పేలుడు తరువాత, జిల్లా ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.దాడి కారణంగా అన్ని పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయబడ్డాయి.ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఇటీవలి కాలంలో అనేక ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ఒక మసీదులో జరిగిన పేలుడులో కనీసం 57 మంది చనిపోయారు.