Site icon Prime9

Sri Lanka Heavy Rains: శ్రీలంకను ముంచెత్తిన భారీ వర్షాలు 14 మంది మృతి

Sri Lanka

Sri Lanka

Sri Lanka Heavy Rains: శ్రీలంకను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు కూలిపడ్డంతో సుమారు 15 మందిమృతి చెందారని శ్రీలంక డిజాస్టర్‌ సెంటర్‌ ఆదివారం వెల్లడించింది. భారీ వరదలకు దేశ రాజధాని కొలంబోలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు నీట మునిగిపోయారు.

దేశవ్యాప్తంగా రుతుపవనాలు.. (Sri Lanka Heavy Rains)

కొండ చరియలు విరిగిపడ్డంతో ఓ 11 ఏళ్ల బాలిక, ఓ 20 ఏళ్ల యువకుడు మట్టిలో కూరుకుపోయారని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ వివరించింది. మరో తొమ్మిది మంది పౌరులపై చెట్లు కూలడంతో దుర్మరణం పాలయ్యారు. కాగా గత నెల 21 నుంచి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి.దిలా ఉండగా శ్రీలంక విషయానికి వస్తే వ్యవసాయంతో పాటు విద్యుత్‌ ఉత్పత్తి అంతా వర్షాధారంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే నిపుణులు మాత్రం రాబోయే రోజుల్లో దేశాన్ని భారీ వరదలు ముంచెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమతూల్యం దెబ్బతినడంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు రావడంతో ఎండలు విపరీంగా కాయడంతో అకాల వర్షాలు కురుస్తాయని నిపుణులు వివరించారు.

దేశంలోని మొత్తం 25 జిల్లాలకు గాను 20 జిల్లాలో భారీ వర్షాలకు ప్రజలు బాగా నష్టపోయారు. కాగా నదుల సరిహద్దుల వద్ద ఉన్న ప్రజలను ప్రభుత్వం ముందస్తుగా హెచ్చరించింది. విదేశాల నుంచి కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే విమానాలను దేశంలోని చిన్న విమానాశ్రయాలకు మళ్లించారు. దేశంలోని అత్యంత కీలక రహదారుల్లో కూడా నీరు నిలిచిపోయింది. ఇదిలా ఉండగా దేశంలోని స్కూళ్లకు సోమవారం నాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాబోయే రోజుల్లో దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని డిజిస్టర్‌ మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. భారీ వర్షాలకు గత వారం ఐదు చిన్న ఏనుగుల కలేబరాలు కనిపించాయి. భారీ వర్షాలకు ఈ ఏనుగులు మునిగిపోయి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు.

Exit mobile version