Women Health Tips: పీరియడ్స్ సమయంలో నొప్పితో పాటు, మహిళలకు అనేక చర్మ సమస్యలు కూడా వస్తాయి.కొంతమంది స్త్రీలకు తమ రుతుక్రమానికి వచ్చే రెండు రోజుల ముందు ముఖంపై మొటిమలు వస్తుంటాయి.అలా ఎందుకు వస్తాయో తెలుసా ? మెనోపాజ్ సమయంలో మహిళల్లో ప్రొజెస్టెరాన్,ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గి చర్మం పొడిబారుతుంది.అలాగే, హార్మోన్ల అసమతుల్యత వల్ల చర్మం పొడిబారడం, ముఖంపై జిడ్డుగా అయి మొటిమలు ఏర్పడతాయి.కాబట్టి అలాంటి సమయంలో ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా సహజసిద్ధంగా ముఖంపై మొటిమలను పోగొట్టుకోవచ్చుని నిపుణులు వెల్లడించారు.
1.కలబంద
స్త్రీలు పీరియడ్స్ సమయంలో మొటిమలు, ఎర్రటి మచ్చలు చాలా బాధిస్తాయి.వీటి నుంచి ఉపశమనం పొందడానికి అలోవెరా బెస్ట్ రెమెడీ.కలబందలో కాల్షియం, క్లోరిన్, సోడియం, పొటాషియం, విటమిన్లు A, B1, B2 వంటి పోషకాలు మనకి పుష్కలంగా దొరుకుతాయి.కాబట్టి అలోవెరా జెల్ ను తీసుకుని మొటిమలపై రాసుకుంటే నొప్పి తగ్గడంతో పాటు మొటిమలను కూడా తగ్గిస్తుంది.
2.పసుపు
పసుపులో యాంటీ సెప్టిక్,రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి.మొటిమలు బాగా వచ్చినప్పుడు సమయంలో మొటిమలను తగ్గించుకోవడానికి పసుపు పేస్ట్ ను రాయండి.
3.ఉసిరికాయ
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది.మొటిమలు బాగా వచ్చినప్పుడు ఆ సమయంలో ఉసిరికాయ పేస్ట్‌ని మొటిమల మీద రాసి అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.