Health: నలభై ఏళ్ళు వచ్చాక మనం ఏ పనులు కూడా చేయలేము. సరిగా వంగ లేము, సరిగా నడవలేము. మరి ఇలాంటప్పుడు వ్యాయామాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. మాములుగా ఉంటేనే మనకి ఏవో ఒక ఆరోగ్య సమస్యలు వస్తాయి. తినే తిండిలో మార్పులు రావడం, నిద్రలేమి సమస్యలు , ఒత్తిడి పెరగడం ఇలా అనేక కారణాల వల్ల నలభై ఏళ్ళు వచ్చాక అనారోగ్య సమస్యల వల్ల బాధ పడుతున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శారీరక శ్రమ చాల అవసరం. మనం, ప్రతి రోజూ నడవా లిసిందే. దీనివల్ల రక్తప్రసరణ కూడా మనకి మెరుగుపడుతుంది. బరువు ఎక్కువ ఉన్న వారు తగ్గుతారు. మంచి నిద్ర పడుతుంది. దీనివల్ల హానికరమైన కొవ్వు కూడా తగ్గుతుంది.
కూరగాయలు, పండ్లను మనం రోజు తీసుకోవటం వల్ల మన మెటబాలిజమ్ పెరుగుతుంది. నొప్పులు, వాపులతో మీరు ఎక్కువ బాధపడుతుంటే క్యాల్షియం ఉండే ఆహారపదార్థాల్ని ఎక్కువ తీసుకోవాలి. సైక్లింగ్ చేయటం వల్ల కూడా మంచి ఫలితం నిపుణులు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో చేసిన ఓ పరిశోధనలో సైక్లింగ్ చేసే వారి శరీరం బలంగా ఉంటుందని పేర్కొన్నారు. వారికీ అనారోగ్య సమస్యలు తక్కువె నని నిపుణులు వెల్లడించారు.
మన శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం తేలికగా వ్యాయామాలు చేయాలి. ఈత కొట్టడం వాళ్ళ బరువు తగ్గుతారు. శరీరం కూడా బలంగా ఉంటుంది. ఇది అలవాటు చేసుకుంటే మనకి ఏ అనారోగ్య సమస్యలు దరి చేరవు. పనులూ, వాళ్ళకు మంచి ఒత్తిడి, సరైన పోషకారం లేకపోతేనే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరం మనకి సహకరించక పోవడం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు ఇలా సమస్యలు వస్తాయి. యోగా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. యోగ రోజు చేయడం వాళ్ళ మన శరీరం ఫిట్టుగా ఉంటుంది. యోగ అలవాటు చేసుకుంటే మానికి మంచి నిద్రపడుతుంది. రక్తప్రసరణ కూడా మెరుగు పడుతుంది.