Sweet Potato: ఎన్నో అనారోగ్య సమస్యలకు చిలగడదుంపతో చెక్ పెట్టవచ్చు. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ గా చిలకడ దుంప పనిచేస్తుంది. ఇది తినడం వల్ల పలు రుగ్మతలకు దూరంగా ఉండొచ్చు.
చిలకడ దుంపలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ ఎ,సీ.. మాంగనీస్, విటమిన్ బీ6 పొటాషియం, పాంటోథెనిక్ యాసిడ్, కాపర్, నియాసిన్ వంటివి ఉంటాయి.
ఇవి మన శరీరంలో మలినాలను పోగొట్టడానికి ఉపయోగపడతాయి.
కాన్సర్ కణాలతో పోరాడే గుణాలు(Sweet Potato)
ఈ దుంపల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్ కణాలతో పోరాడగలుగుతాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కొన్ని రకాల కాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి.
అయితే, చిలకడ దుంపల్ని తొక్కతో సహా తినాలి.
చిలకడ దుంపల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్లలో కాంతిని గ్రహించే రిసెప్టర్లు తయారయ్యేలా చేస్తుంది. దాని వల్ల కంటి చూపు మెరుగవుతుంది.
చిలకడ దుంప తొక్కలో కూడా కాన్సర్‌ను అడ్డుకునే గుణాలు ఉంటాయట. అంతే కాకుండా చిలకడ దుంపల్లో ఇమ్యూనిటీ కావాల్సినంత ఉంటుంది. వీటిలోని విటమిన్ ఎ వ్యాధినిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
మధుమేహ బాధితులకు చిలగడ దుంపలు ఓ వరం లాంటివి. ఇవి బ్లడ్ షుగర్ ను నియంత్రణలో ఉంచడంలో బాగా ఉపయోగపడతాయి.
ఒత్తిడిని తగ్గించేందుకు
ఈ దుంపల్లో ఉండే అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్ క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఇవి మన శరీరంలోని కండరాలు, నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుంది. పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాకి చిలకడ దుంపలు బలాన్ని ఇవ్వడం ద్వారా ఉదర సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.
చిలకడదుంపలో బంగాళదుంప, కందగడ్డలో కన్నా అధిక మొత్తంలో పీచు పదార్థం ఉంటుంది.
ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి తిన్న ఆహారాన్ని తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.
చిలగడదుంపలో ఉండే పాంథోనిక్ యాసిడ్ వల్ల శరీర ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఇది శరీరానికి కావలసిన అన్ని పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
చిలగడ దుంపలో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది పళ్ళు బలంగా ఉండేందుకు.. పళ్ల నుంచి రక్తం కారే సమస్యలను అరికట్టడానికి సహాయపడతాయి. పంటి సమస్యలను దరిచేరనివ్వదు.
చిలగడదుంపలు న్యూటియంట్స్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించి శరీర కండర పుష్టికి సహాయపడుతుంది.
నష్టాలు లేకపోలేదు
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చిలకడ దుంపతో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
కిడ్నీ లో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు చిలకడ దుంపకు దూరంగా ఉండటం మంచిది. ఇందులో ఉండే ఆక్సలేట్ ఆమ్లం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతుంది.
జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు కూడా చిలకడ దుంప తీసుకోకూడదు. ఉబ్బరం, కడుపు నొప్పి లాంటివి వచ్చి ఇబ్బంది పెడతాయి.
స్కిన్ అలర్జీ కలిగిన వాళ్లు కూడా స్వీట్ పొటాటో కు ఖచ్చితంగా దూరంగా ఉండాలంటున్నారు నిపుణలు. మైగ్రేన్ తలనొప్పి ఎక్కువగా వస్తుంటే చిలకబ దుంపను దూరం పెట్టాలి.