Site icon Prime9

Tea With Snacks: టీతో కలిపి ఈ స్నాక్స్ తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యం అంతే సంగతి..?

Tea With Snacks

Tea With Snacks

Tea With Snacks: ఒక్క కప్పు వేడివేడి టీ లేదా చాయ్ ఎంతో ఒత్తిడి అలసటతో కూరుకుపోయిన శరీరానికి నూతనోత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. ఒక కప్పు చాయ్ చాలు అమాంతం ఆ స్ట్రెస్ అంతా మరిచి కాస్త చిరునవ్వు చిందించడానికి మరల పనిలోకి వెళ్లడానికి. ఇంక చాయ్ ప్రేమికులైతే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు పూటలా చాయ్ తాగుతూ తమ మూడ్స్ ని రిఫ్రెష్ చేసుకుంటుంటారు. ఇంతలా టీ మన జీవనంలో ఓ పార్ట్ అయిపోయింది కాబట్టి మన దేశంలో టీని ఇష్టపడే వారి సంఖ్య రోజురోజుకి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టీ ఇప్పుడు అనేక రకాలుగా దొరుకుంతుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీ, చమోమిలే టీ, మందార టీ అబ్బో ఇలా చెప్తూ పోతే చాలా రకాలే ఉన్నాయి. అయితే చాయ్ తాగేప్పుడు కేవలం ఛాయ్ మాత్రమే తాగితే ఎలా చెప్పండి.. అలా సాయంకాలం వేళ స్నాక్స్ తింటూనో ఓ సిప్ టీ తాగితే ఆహా ఆ సుఖమే వేరే లెవెల్ అనుకున్నవాళ్లూ లేకపోలేదు. మరి ఇదంతా తెలిసిందే కదా మళ్లీ ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారు కదా.. ఇక్కడే మనం తప్పులో కాలేస్తున్నాం. టీతో పాటు కొన్నిరకాల ఆహారపదార్ధాలను అస్సలు కలిపి తీసుకోకూడదు అంట. మరి ఆ పదార్థాలు ఏంటి వాటిని తీసుకుంటే ఏమవుతుందో ఓ సారి చూసేద్దాం.

సైడ్ ఎఫెక్ట్స్ ఇవే(Tea With Snacks)..

  1. టీ తాగేటప్పుడు రుచికోసం, కారంగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. ఉదాహరణకు వెల్లుల్లి, ఉల్లిపాయ, వేడి సాస్, కూర, మిరపకాయ ఇలాంటివి చాయ్ తాగుతూ తీసుకోకూడదు. ఇవి టీ సున్నితమైన రుచిని పాడుచేస్తాయి.
  2. సిట్రస్ పండ్లు అంటే నిమ్మజాతికి సంబంధించిన ఆరెంజ్, బత్తాయి, నిమ్మకాయ, వాటితో పాటు గ్రేప్స్ ఇలాంటి పండ్లలో ఆమ్లత్వం అధికంగా ఉంటుంది. ఇలా ఉండే ఆహారాలు, టీలో ఉండే కాటెచిన్స్ (యాంటీ ఆక్సిడెంట్లు) శోషణకు అడ్డు తగులుతాయి. దానితో మీ శరీరం గ్రహించగల యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం తగ్గిస్తుంది.
  3. పాలు లేదా క్రీమ్ టీలోని పాలీఫెనాల్స్‌ను తటస్థీకరిస్తుంది. వాటి యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను తగ్గిస్తుంది. అయితే, ఈ ప్రభావం బ్లాక్ టీలలో తక్కువగా ఉంటుంది. కొంతమంది తమ టీలో పాలు లేదా క్రీమ్ కలుపుకుంటారు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
  4. కేకులు, బిస్కెట్లు, చాక్లెట్ వంటి స్వీట్ పదార్దాలు టీ రుచిని పాడుచేస్తాయి. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి తీపి పదార్ధాలను టీ తాగేటప్పుడు అవాయిడ్ చెయ్యడం మంచిది.
  5. వేయించిన ఆహారాలు బరువుగా ఉంటాయి. ఇవి త్వరకగా శరీరంలో జీర్ణం కావు. మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది కానీ వేయించిన ఆహార పదార్దాలను టీతో కలిపి తినడం వల్ల ఈ ప్రయోజనాన్ని కోల్పోతాము.

సాధారణంగా, తేలికైన, రుచికరమైన స్నాక్స్ లేదా టీ రుచిని అధిగమించని సున్నితమైన పేస్ట్రీలను ఎంచుకోవడం ఉత్తమం.

Exit mobile version