Raisins Benefits: రక్తహీనత సర్వ సాధారణ సమస్య. పిల్లల్లో, మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. దేశంలో 6 నెలల నుంచి ఆరేళ్ల వయసు పిల్లల్లో 67% మంది, మహిళల్లో 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎర్ర రక్తకణాలు తగినంతగా ఉత్పత్తి కాకపోవటం.
ఒకవేళ ఉత్పత్తి అయినా కొందరిలో త్వరగా క్షీణిస్తుంటాయి. రక్తం కోల్పోవటమూ ఈ సమస్యకు కారణమవుతుంది. చాలామందిలో ఐరన్ లోపంతోనే రక్తహీనత తలెత్తుతుంటుంది.
ఇది లోపిస్తే ఎర్ర రక్తకణాలు తగినంత ఉత్పత్తి కావు. దీంతో అలసట, ఆయాసం లాంటి లక్షణాలు వేధిస్తాయి.
అయితే, ఐరన్ లోపం తగ్గటానికి ఎండు ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లూ ఉంటాయి.
రాత్రిపూట 10-15 ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున వాటిని తిని నీళ్లు తాగటం మంచిది. ఇది ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా రక్తహీనత కూడా తగ్గుతుంది.
ఎన్నో ప్రయోజనాలు(Raisins Benefits)
ఎండుద్రాక్ష అందానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఐరన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి చర్మం నిగనిగలాడేలా చేస్తాయి.
అయితే మధుమేహం గలవారు వీటిని మితంగానే తినటం మంచిది.
నల్ల ఎండుద్రాక్ష(Raisins) లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యాల్షియం కూడా ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎముకలు పెళుసు బారకుండా కాపాడతాయి.
నల్ల ఎండుద్రాక్షలో ఐరన్‌తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. శరీరం ఖనిజాలను త్వరగా గ్రహించుకోవటానికి విటమిన్ సి తోడ్పడుతుంది. ఫలితంగా వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఎండుద్రాక్షలోని పొటాషియం రక్తంలో సోడియం మోతాదులు తగ్గటంలో సాయం చేస్తుంది. కాబట్టి తరచూ ఎండుద్రాక్షలను తింటుంటే రక్తపోటు తగ్గుముఖం పడుతుంది.
రోజూ కొన్ని ఎండుద్రాక్షలను తినటం గుండె ఆరోగ్యానికి కూడా మేలు. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి మరి.
కొలెస్ట్రాల్ తగ్గితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటమూ తగ్గుతుంది. దీంతో గుండెకు రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.
ఎండుద్రాక్ష లో పీచూ ఎక్కువగానే ఉంటుంది. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గటానికి ఎండు ద్రాక్ష తోడ్పడుతుంది.
శక్తిని కూడా పెంపొందిస్తుంది. ఛాతీ మంట, అజీర్ణం తగ్గటానికి ఉపయోగపడుతుంది.