Site icon Prime9

Garlic For Weight Loss: వీటిలో వెల్లుల్లి చేర్చుకుంటే బరువు తగ్గడం చాలా సులువు ..

how garlic helps for-weight-loss

how garlic helps for-weight-loss

Garlic For Weight Loss: ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పుల, ఒత్తిడి ఇలా ఏవేవో బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందువల్లనే నేటి కాలంలో అనేక మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బుల సమస్యలు పెరుగుతాయి. ఊబకాయం శరీరంలో వేళ్లూనుకుపోయిందంటే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమవుతుంది. దాని కారణంగానే ఎంతో మంది సులువుగా బరువు తగ్గించుకోవాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందం కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా బరువు తగ్గడం ఎంతో ముఖ్యం . ఊబఖాయం అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు ,ఎన్నో తెలుసుకొని ఉంటారు . అయితే ఈ విషయం లో ఇంకో సలహాల ఇది తెలుసుకుందాం . బరువు తగ్గించడంలో పచ్చి వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుందని. ఎలాగంటే..

ఆయుర్వేదం ప్రకారం.. పచ్చి వెల్లుల్లి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పచ్చి వెల్లుల్లి కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కానీ పచ్చి వెల్లుల్లి వాసన, ఘాటు కారణంగా చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ ఇది తినడం వల్ల ఎంతో లాభం ఉంటుంది . పచ్చి వెల్లుల్లిని ఈ కింది విధంగా తిన్నారంటే రుచితోపాటు సులువుగా బరువు కూడా తగ్గొచ్చు. నిజానికి గ్రీన్ టీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది .ఈ విషయం అందరికీ తెలిసిందే . అలాగే ఈ గ్రీన్ టీని తయారుచేసేటప్పుడు కొంత పచ్చి వెల్లుల్లి పేస్ట్‌ వేసుకోవచ్చు. నీరు మరిగేటప్పుడు దీనిని వేసుకోవాలి. తర్వాత వడకట్టి సర్వ్‌ చేసుకుంటే వెల్లుల్లి గ్రీన్ టీ సిద్ధం అయినట్లే. రుచి కోసం తేనె లేదా అల్లం కూడా వేసుకోవచ్చు.

డిటాక్స్ వాటర్ తాగడం వల్ల కూడా బరువు సులభంగా తగ్గొచ్చు. వెల్లుల్లిని దంచి వేడి నీటిలో కలపాలి. అందులో నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.పుల్లని పెరుగులో పచ్చి వెల్లుల్లి తురుము కూడా కలపవచ్చు. వెల్లుల్లి తురుమును ఇతర వంటకాలతో కూడా వినియోగించవచ్చు. ఈ విదంగా మనం తినే ఆహారం లో ఈ వెల్లుల్లి చేర్చుకున్నట్లు అయితే సులువుగా బరువు తగ్గడానికి దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు .

Exit mobile version