Site icon Prime9

Health Tips: మలబద్ధకం, అజీర్ణ సమస్యలకు చెక్ పెట్టే వంటింటి చిట్కాలు

home-remedies-for-acidity-that-you-must-try

home-remedies-for-acidity-that-you-must-try

Health Tips:  కడుపు మరియు గుండెల్లో మంటగా ఉందా మలబద్ధకం, అజీర్ణం సమస్యలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయా? మీరు ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడుతున్నారా అయితే ఈ సమస్యలన్నింటికి చక్కని వంటింటి చిట్కాలు చూసేద్దాం. మీరు సరైన సమయానికి భోజనం చెయ్యకపోయినా లేదా మద్యపానం దూమపానం వంటి అలవాట్లను కలిగి ఉన్నా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.వీటన్నింటికి ఆయుర్వేదంలో చక్కని చిట్కాలు ఉన్నాయి. మరి అవేంటో చూసెయ్యండి.

తులసి

తులసి ఆకులు కార్మినేటివ్ లక్షణాలు ఉంటాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను త్వరగా శాంతపరుస్తుంది. మీకు కడుపులో ఇబ్బందిగా అనిపించినప్పుడు కొన్ని తులసి ఆకులను నమలండి. దీని వల్ల కడుపులో మంట తగ్గుతుంది. కడుపులో ఎసిడిటీ వల్ల వచ్చే సమస్యలను ఈ తులసి ఆకులతో నయం చేయవచ్చు. కొన్ని ఆకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని వేడిగా ఉన్నప్పుడే తూగుతూ ఉండడం వల్ల మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

గోరువెచ్చని నీరు..
జీర్ణక్రియను సులభతరం చేయడానికి, కడుపు లైనింగ్‌ను శాంతపరచడానికి, గ్యాస్ట్రిక్ ఆమ్లాల వల్ల ఇబ్బంది కలగకుండా, యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించడానికి ఒక కప్పు గోరువెచ్చని నీటిని పరిగడుపున తాగడం చాలా ఉత్తమమని నిపుణులు అంటున్నారు.

బెల్లం
బెల్లంలో మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది జీర్ణక్రియను పెంచడంలో సహాయపడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, కడుపు ఉబ్బరాన్ని తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలి లేకపోవడాన్ని కూడా బెల్లం ద్వారా సరిచేసుకోవచ్చు.

మజ్జిగ
మజ్జిగ ఒక గొప్ప ప్రోబయోటిక్. ఇది మీ కడుపు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేయగలదు. అంతేకాకుండా ఎసిడిటీకి అద్భుతమైన విరుగుడుగా మారుతుంది.
మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కడుపులోని ఆమ్లాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఈ పరిస్థితి మీకు చికాకు కలిగించే లక్షణాల నుంచి తక్షణమే ఉపశమనం అందిస్తుంది. గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది.

ఇదీ చదవండి: “బ్లాక్ వాటర్” తాగడం వల్ల యవ్వనం మీ సొంతం

Exit mobile version