Health Tips : రోజూ సాయంత్రం అవ్వగానే ఇంట్లో తినడానికి ఏమి ఉన్నాయా అని వెతుక్కుంటూ ఉంటాము. మనలో చాలా మంది సాయంత్రం ఐతే స్నాక్ తినాలనిపిస్తే, కొంత మంది వేయించిన శనగలు తింటూ ఉంటారు. వేయించిన శనగలు తినడానికి టేస్ట్‌గా ఉంటాయి. వీటినే పుట్నాల పప్పులు అని కూడా పిలుస్తారు. వేయించిన శనగలతో టేస్టీ, టేస్టీ వంటకాలు చేస్తూ ఉంటారు. వీటితో గన్ ఫౌడర్, చట్నీ, ఇంకా కొత్త రకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. వేయించిన శనగలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
బరువు తగ్గుతారు
వేయించిన శనగలు ఫైబర్ ఎక్కువుగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం వల్ల కడుపు ఫుల్ గా ఉంటుంది. జీర్ణ క్రియ సమస్య ఉన్న వారు రోజుకు గుప్పెడు శనగలు తీసుకుంటే చాలు.
షుగర్ కంట్రోల్‌లో అవుతుంది
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలను షుగర్ పేషెంట్స్‌కు తీసుకోవడం వల్ల చాలా మంచిది. తక్కువ GI ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు గురి కాకుండా ఉంటాయి. వేయించిన శనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 28 శాతం ఉంటుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. ఇది మన గుండెకు చాలా మంచిది. ప్రతి రోజూ గుప్పెడు పుట్నాలు తింటే చాలు. గుండె సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి.